Ads
హిందువుల పండుగలో అత్యంత ప్రాధాన్యత ఉన్న పండుగలో ఒకటి ముక్కోటి ఏకాదశి. ఈరోజు విష్ణు ఆలయాలు ఎక్కడ చూసినా భక్తులతో రద్దీగా కనిపిస్తూ ఉంటాయి. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు.ఇది మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చిన ముక్కోటి ఏకాదశి. దీన్నే మోక్షదా ఏకాదశి అని అంటారు. చాలా మంచి రోజు.
Video Advertisement
ఇవాళ విష్ణు ఆలయాల్లో వైకుంఠధామంలో ఉన్న శ్రీమన్నారాయణుడిని ఉత్తర ద్వారం నుంచి వెళ్లి భక్తులు దర్శించుకుంటారు.వైష్ణవ సంబంధ గ్రంథాల్లో సంహితా గ్రంథాలు అనేవి చాలా ప్రత్యేకమైనవి. వాటిలో శ్రీప్రశ్న సంహిత అనే గ్రంథంలో ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశికి సంబంధించిన నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం స్వామిని దర్శించుకోవడం ద్వారా మోక్షప్రాప్తి లభిస్తుంది అని పండితులు తెలిపారు.
అసలు ఉత్తర ద్వారం నుంచి ఎందుకు దర్శించుకోవానేది చాలామందికి తెలియదు. పురాణాల ప్రకారం మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసుల విష్ణువుతో యుద్ధం చేస్తారు. కానీ గెలవలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు మీకు ఏం వరం కావాలో కోరుకోమని స్వామి వారిని కోరతారు. వారు గర్వంతో నిండి మాకు నువ్వు వరం ఇచ్చేదేంటి, మేమే నీకు వారం ఇస్తాం…ఏం కావాలో కోరుకో అని అంటారు. దాంతో స్వామి వారిద్దరినీ తన చేతిలో చనిపోవాల్సిందిగా వరం కోరతారు.
అందుకు ఆ రాక్షసులు ఒప్పుకొని చనిపోతారు. అలా మాట నిలబెట్టుకున్నందుకు వారిని ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠధామంలోకి పంపిస్తారు. అలా లోపలికి వెళ్లిన వారు రాక్షసుల నుండి మంచి వారిగా మారిపోతారు. దాంతో తమకు కలిగిన భాగ్యాన్ని అందరికీ కల్పించాలని ఆ రాక్షసులు కోరతారు.అందుకు స్వామి ఒప్పుకుంటారు.
ఉత్తర ద్వారం నుంచి విష్ణులోకానికి వెళ్లి మధుకైటభులు ఎలాగైతే మారిపోయారో అలా ఉత్తర ద్వారం ద్వారా ఇవాళ శ్రీమన్నారాయనుణ్ని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇహలోకంలో సర్వ సంపదలు,పరలోక మోక్షప్రాప్తి లభిస్తుందని పండితులు తెలిపారు. అయితే ఇందుకు కొన్ని నియమాలు పాటించాలని ఉందని తెలిపారు.
ఇవాళ ఉత్తర ద్వారం దర్శనం చేసేవారు అబద్ధం చెప్పకూడదు, కోపం రాకూడదు,రోజంతా ఉపవాసం చెయ్యవచ్చు లేదా పాలు, పండ్లు తీసుకోవచ్చు లేదా ఉడకబెట్టని పదార్థాలు తీసుకోవచ్చు లేదా పగలు అంతా ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినవచ్చు. ఐతే పిల్లలు, ముసలి వాళ్లు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదని పండితులు తెలిపారు.
ఉత్తర ద్వార యోగ శాస్త్ర రహస్యం అనేది ఒకటుంది. అంటే మానవ శరీరంలో ముఖం అనేది తూర్పు దిక్కు,సహస్రారం అనేది ఉత్తర దిక్కును చూపిస్తుంది. శరీరం అనేది దేవాలయం లాంటిది. ఉత్తర దిక్కు ద్వారా స్వామిని దర్శిస్తే మానవ శరీరంలో కుండలినీ శక్తి ప్రేరేపితం అవుతుంది. తద్వారా ఆధ్యాత్మికత భావన పెరుగుతుంది.
విష్ణు కృపకు పాత్రులు అవుతారు అని పండితులు తెలిపారుఇవాళ ఉత్తర దిక్కున స్వామిని దర్శించుకునే వారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అలాగే విష్ణు సహస్ర నామంలో చెప్పిన అమృతాం శూద్భవో భానుః శశిబిందు సురేశ్వరః జౌషధం జగతః సేతుః సతృధర్మ పరాక్రమః అనే శ్లోకం చదువుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు
End of Article