మనం గట్టిగా అనుకోవాలే కానీ మనం సాధించలేనిది ఏదీ ఉండదు. మన సంకల్పబలమే మనకి సగం విజయాన్ని చేకూరుస్తుంది అని చెప్పడానికి ఈ మహిళా ఐపీఎస్ జీవితమే ఉదాహరణ. ఆమె తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆమె భర్త కూడా ఆమెకు బాసటగా నిలిచారు. ఈ ఆదర్శ దంపతుల స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Video Advertisement

పదవ తరగతి పూర్తవ్వకపోయినా.. పదునాలుగేళ్లకే ఆమెకు తల్లితండ్రులు వివాహం చేసేసారు. కానీ, భర్త సాయంతో ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యాక చదువుకుని, నేడు ఐపీఎస్ గా నిలిచారు.

ambika 1

వివరాల్లోకి వెళితే, అంబిక కు పదునాలుగేళ్ల వయసులోనే ఓ పోలీస్ ఆఫీసర్ తో వివాహం జరిగింది. పద్దెనిమిది సంవత్సరాలకే అంబిక ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారు. ఆ తరువాత ఓ సారి తన భర్తతో కలిసి రిపబ్లిక్ డే పెరేడ్ కు వెళ్లారు. ఆ టైములో ఓ ఇద్దరు సీనియర్ పోలీస్ ఆఫీసర్లను గౌరవించడం చూసారు. ఆ హోదా, అలాంటి గౌరవం తనకి కూడా కావాలంటూ ఆమె భర్తతో మాట్లాడేసరికి.. అది అంత ఈజీ కాదని, ఐపీఎస్ సాధించాలని భర్త అంబికకి నచ్చ చెప్పే ప్రయత్నం చేసారు.

ambika 2

అప్పటికి అంబిక పదవ తరగతి కూడా పూర్తి చేయలేదు. కానీ.. ఎంత కష్టమైనా తన కల నెరవేర్చుకుంటానని అంబిక పట్టు పట్టడంతో ఆమెకు సహకరించాలని అనుకున్నారు. ఆమె భర్త కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. ఆయన సాయంతోనే పదవ తరగతి పూర్తి చేసిన అంబిక ఇంటర్, డిగ్రీ చదువుని కూడా పూర్తి చేశారు. అంతటితో అంబిక ఆగిపోలేదు. సివిల్స్ కూడా చదవాలని అనుకున్నారు.

ambika 4

కానీ, వారు ఉంటున్న దిండిగల్‌ లో సివిల్స్ కోచింగ్ సెంటర్ లేదు. అందుకోసం.. ఆమెను భర్త చెన్నైకు పంపించారు. అక్కడ ఆమె ఉండడానికి వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేసారు. పిల్లలని తాను చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటానని.. కోచింగ్ తీసుకుని పరీక్షకు సిద్ధం అవ్వమని భార్యని ప్రోత్సహించాడు. అలా భర్త ప్రోత్సాహంతో కోచింగ్ తీసుకున్న అంబిక రెండు సార్లు ఐపీఎస్ లో ఫెయిల్ అయ్యింది. దీనితో.. ఆమెను ఇంటికి వచ్చేయాలని భర్త కోరాడు. కానీ, అంబిక పట్టు వదల్లేదు. చివరిసారిగా ప్రయత్నిస్తానని భర్తని ఒప్పించి.. మరో సారి ఐపీఎస్ పరీక్ష రాసింది.

ambika 3

ఈసారి ఆమె ఉత్తీర్ణురాలు అయ్యారు. అలా ఆమె 2008 లో ఐపీఎస్ కు ఎంపిక అయ్యారు. ఆ తరువాత అంబిక హైదరాబాద్ పోలీస్ అకాడెమి లో శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ముంబాయి నార్త్ డివిజన్ డీసీపీగా నియమించబడ్డారు. ఆమె దూకుడు, పనితనం చూసి ఆమెను ముంబై సివంగి అని పిలుస్తూ ఉంటారు. ఇటీవలే ఆమె విధులకు, సేవా తత్పరతకు తగిన గుర్తింపు లభించింది. ఆమెకు ‘లోక్‌మత్ మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్- 2019’ పురస్కారం లభించింది.