Ads
భారత దేశం భిన్నత్వం లో ఏకత్వానికి ప్రతీక. ఇక్కడ భిన్న మతాలు వాటి మధ్య ఏకత్వం కనిపిస్తూ ఉంటుంది. ఇలా కేవలం భారత్ లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ పరిస్థితులు అంతగా కనిపించడంలేదు. కానీ.. భారత్ ఇంకా ఏకత్వం బతికే ఉంది అని ఈ ఫోటో నిరూపిస్తుంది.
Video Advertisement
ముస్లిం లు హిందూ దేవతలను, అలాగే హిందువులు ముస్లిం దేవుడిని గౌరవిస్తుండడం చూస్తూనే ఉన్నాం. దాదాపు పదిహేనేళ్లుగా వారణాసిలోనే ఉంటున్న ఓ ముస్లిం కుటుంబం శ్రీ రామునికి హారతిని ఇస్తున్న ఫోటో ఇది. వారు ఈ సంప్రదాయాన్ని గత పదిహేనేళ్లుగా కొనసాగిస్తూ వస్తున్నారట. ఆ మహిళ పేరు సంజీన్ అన్సారీ. నిన్న దీపావళి సందర్భంగా ఆమె మరికొందరు ముస్లిం మహిళలతో కలిసి శ్రీరామునికి కీర్తనలు పాడుతూ హారతిని ఇచ్చారు. దీనితో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
End of Article