సూపర్ మార్కెట్ కి వెళ్లినప్పుడు మనం ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాము చాలా ఎక్కువ షాపింగ్ చేసేస్తూ ఉంటాము. తిరిగి వచ్చాక చాలా డబ్బులని ఖర్చు చేసేసాం అని బాధపడుతూ ఉంటాము. మీకు కూడా ఎప్పుడు ఇలానే అనిపిస్తూ ఉంటుందా..? సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు కానీ డబ్బులు ఆదా చేసుకోవాలని ఎక్కువ షాపింగ్ చేయకుండా చూసుకోవాలని మీరు భావిస్తుంటే కచ్చితంగా ఈ టిప్స్ చూడాల్సిందే. ఇలా కనుక మీరు ఫాలో అయ్యారంటే మంచిగా డబ్బులను ఆదా చేసుకోవడానికి అవుతుంది.

Video Advertisement

షాపింగ్ ఎక్కువ చేయకుండా ఉండాలంటే ఇలా చేయండి:

#1. ఇంట్లో ఉండే వాటిని చూసుకోండి:

షాపింగ్ కి వెళ్లేటప్పుడు అవసరమైనవి తప్ప అన్ని కొనుక్కుని వస్తుంటారు చాలా మంది. అలా కాకుండా ఇంట్లో ఉన్నవి ఫస్ట్ చూసుకోండి. ఆ తర్వాత మీరు ఒక లిస్టు ని తయారు చేసుకోండి ఇలా కనుక మీరు షాపింగ్ కి వెళ్తే ఖచ్చితంగా డబ్బులు ఆదా చేయడానికి అవుతుంది.

#2. తక్కువ కావాల్సినవి మొదటి తీసుకోండి:

ముందు తక్కువ ఏమి తీసుకోవాలి అనుకుంటున్నారో వాటిని కొనండి. తర్వాత మిగతా వాటిని చూడండి.

#3. ఫ్రిడ్జ్ ని బాగా ఉపయోగించడం మంచిది:

ఫ్రిడ్జ్ లో మనం పాలు, పెరుగు, పండ్లు వంటివి అన్నీ కూడా బాగా నిల్వ చేసుకోవచ్చు కేవలం అవసరమైనప్పుడు వాటిని మనం తీసి ఉపయోగించుకోవచ్చు. కానీ ప్రతిదీ ఫ్రిజ్లో పెట్టేయకండి. ఫ్రిడ్జ్ ద్వారా చాలా మంది ఎక్కువ ఆహారాన్ని వృధా చేస్తారు.

#4. క్లీనింగ్ చేసేవి:

క్లీనింగ్ చేయడానికి మనకి అన్నీ అవసరమవ్వవు. చాలామంది క్లీనింగ్ కోసం నాలుగు అయిదు రకాలు వాడుతూ ఉంటారు అలా కాకుండా అవసరం అనుకున్న వాటినే ఉపయోగించండి.

#5. ఎక్కువ సామాన్లను కొనకండి:

వారంలో మీరు ఏమి వండాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారు దానికి తగ్గ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయండి. ఎక్కువ సామాన్లని కొనుగోలు చేయడం వలన పాడైపోతాయి. డబ్బులు వృధా.