సాధారణంగా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాటిలో మనకి కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యు చేసే వ్యక్తి కనుక ఈ ప్రశ్నలు అడిగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందట.
అమెరికన్ ఫెడరల్ లా ప్రకారం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తే దానిని చట్టరీత్యా నేరంగా భావిస్తారు. అయితే ఈ విషయాలపై చాలా మందికి అవగాహన లేదు ఒకవేళ కనుక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ చేస్తే వ్యక్తి కనుక ఈ ప్రశ్నలు అడిగితే ఇంటర్వ్యూ కి వెళ్లిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చెయ్యచ్చు. మరి ఆ ప్రశ్నలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
#1. పెళ్లి అయ్యిందా లేదా?:
పెళ్ళికి సంబందించిన అంశాలని అడగకూడదు. ఇంటర్వ్యూ సమయంలో ఎవరిని కూడా వారి వైవాహిక జీవితం గురించి ఎలాంటి ప్రశ్నలు అడగకూడదు. ఇలా అడగడం అమెరికాలో చట్టరీత్యా నేరం.
#2. అభ్యర్థి వయసు:
అమెరికాలో ఏ ఇంటర్వ్యూలో కూడా 40 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళని వయసు ఎంత అని అడగరు. అలాగే వయసుకు సంబంధించిన ప్రశ్నలు కూడా తీసుకు రారు. 1967ADEA చట్టం ప్రకారం వ్యక్తి యొక్క వయసుకు సంబంధించిన ప్రశ్నలు అడగడం చట్టరీత్యా నేరం. అయితే ఎక్కువగా కంపెనీలో యువకులకు ప్రాధాన్యత ఇస్తారని.. అలాంటి పక్షపాత ధోరణి కలగకుండా ఉండటానికి దీనిని తీసుకువచ్చారు.
#3. అమెరికా పౌరులు ఏనా:
పౌరసత్వం, ఇమిగ్రేషన్ ని తీసుకుని ఉద్యోగిపై వివక్ష చూపకూడదు. ICRA ప్రకారం ఇది చట్టరీత్యా నేరం. ఇంటర్వ్యూ సమయంలో ఈ ప్రశ్న అడగకూడదు . కానీ తర్వాత అడగొచ్చు.
#4. మీరు గర్భవతా?:
గర్భధారణ స్థితికి సంబంధించి ప్రశ్నలు కూడా అడగకూడదు. ప్రెగ్నెన్సీ డిస్క్రిమినేషన్ యాక్ట్ 1978 ప్రకారం కూడా మహిళని గర్భవత అని అడగకూడదు. అలానే గర్భవతి అవడం వల్ల ఉద్యోగం నుంచి తీయకూడదు. ఒక వ్యక్తి ప్రెగ్నెన్సీ లీవ్స్ తీసుకుంటే అప్పుడు మాత్రమే ఆ విషయాన్ని అడగాలి లేదు అంటే శిక్ష కూడా పడుతుంది.
#5. మతానికి సంబంధించిన ప్రశ్నలు:
ఇంటర్వ్యూ సమయంలో మీరు ఏ మతం అని అడగకూడదు. ఇది కూడా చట్ట రీత్యా నేరం. ఈ ప్రశ్నలు కనుక అమెరికాలో ఇంటర్వ్యూ సమయంలో అడిగితే జైలు శిక్ష పడుతుంది.