నవరాత్రుల్లో తినకూడని పదార్థాలు ఏవో తెలుసా..?

నవరాత్రుల్లో తినకూడని పదార్థాలు ఏవో తెలుసా..?

by Megha Varna

పూజ సమయంలో మనం సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి. అంటే స్వచ్ఛమైన శాఖాహారం. చాలా మందికి ఈ సందేహం ఉంటుంది ఎందుకు సాత్విక ఆహారాన్ని మాత్రమే పూజ సమయంలో తీసుకోవాలి అని…. నిజానికి ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటే ప్రేమ, కృతజ్ఞత అవగాహన కలిగి ఉంటారు.

Video Advertisement

అలానే ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎంతో ప్రశాంతంగా ఉంటారు. అందరితో స్నేహ పూర్వకంగా మెలుగుతారు. అందుకే పూజ సమయంలో ఎక్కువ మంది సాత్వికాహారంని మాత్రమే తీసుకుంటూ ఉంటారు.

మసాలా దినుసులు, వెల్లుల్లి, డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్ధాలు, కాఫీ, టీ, పంచదార తో చేసిన ఆహార పదార్థాలు, చాక్లెట్స్ మొదలైన ఆహార పదార్థాలు అన్నీ కూడా రజాసిక్ గుణాలు కలిగి ఉంటాయి. వీటి వల్ల యాంగ్జైటీ పెరుగుతుంది. వేగంగా కోపం వస్తుంది. ఆందోళన ఉంటుంది.

అలానే తమాసిక్ ఆహారం అంటే గుడ్లు, మాంసం, ఆల్కహాల్, సిగరెట్లు వంటివి. ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే.. మనసుకి శరీరానికి హాని కలుగుతుంది. వీరిలో దయ కలిగే ఆలోచనలు ఉండవు. మానవ శరీరం లో మొత్తం మూడు గుణాలు ఉంటాయి. అవే సత్వగుణం, రజో గుణం, తమో గుణం. సత్వ గుణము ఉంటే దైవం పై దైవకార్యల పై మనస్సు వెళుతుంది. నిత్యం ప్రశాంతంగా ఉండడానికి అవుతుంది. అందుకని పూజ సమయం లో సాత్విక ఆహారం తీసుకుంటూ ఉండాలి.

అదే విధంగా ఈ నవరాత్రుల్లో కూడా సాత్వికాహారం తీసుకోవాలి. అప్పుడు దైవకార్యం వైపు మనసు మళ్లుతుంది. చక్కగా ప్రశాంతంగా ఉండొచ్చు. రాముడు, కృష్ణుడు వంటి వాళ్లు సత్వ గుణం కలిగి ఉన్నవారు. అదే రజోగుణం వుందంటే అసంతృప్తి, అశాంతి వంటివి కలుగుతాయి. ఒకవేళ కనుక తమో గుణం ఉందంటే నిద్ర, సోమరితనం వంటివి నిత్యం ఉంటాయి. అందుకని శరన్నవరాత్రుల సమయం లో ఈ తప్పులు చేయకుండా మంచిగా వుండండి. ప్రశాంతంగా ఆనందంగా పూజలు చేసుకుంటూ చక్కటి ఫలితాన్ని పొంది ఆనందంగా జీవించండి.


You may also like