ఆహాలో కొత్తగా వచ్చిన ఈ సినిమా చూశారా..? ఎలా ఉందంటే..?

ఆహాలో కొత్తగా వచ్చిన ఈ సినిమా చూశారా..? ఎలా ఉందంటే..?

by Mohana Priya

Ads

ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ ని ప్రేక్షకులకు అందించడంలో ముందు ఉంటుంది ఆహా. అలా ఈ వారం కూడా ఒక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఆ సినిమా పేరు మై డియర్ దొంగ. అభినవ్ గోమటం, షాలిని కొండేపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, శశాంక్ మండూరి ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. బిఎస్ సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, షాలిని కొండేపూడి రైటర్ గా చేశారు. క్యాం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద మహేశ్వర్ రెడ్డి గోజాల ఈ సినిమాని నిర్మించారు.

Video Advertisement

 my dear donga aha review telugu

ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, సుజాత (షాలిని కొండేపూడి) రెండు సంవత్సరాల నుండి విశాల్ (నిఖిల్ గాజుల) అనే ఒక డాక్టర్ తో రిలేషన్ షిప్ లో ఉంటుంది. విశాల్ సుజాతని పట్టించుకోడు. ఐసీయూలో ఉన్నాను అని చెప్పి క్రికెట్ మ్యాచ్ చూడటం వంటివి చేస్తూ ఉంటాడు. ఇవన్నీ తెలిసిన సుజాత బాధలో ఇంటికి వస్తుంది. అప్పటికే ఇంట్లో సురేష్ (అభినవ్ గోమటం) అనే దొంగ పడతాడు. ముందు భయపడినా కూడా, తర్వాత ఇద్దరి నేపథ్యాలు ఒకేలాగా ఉండడంతో మాట్లాడుకోవడం మొదలు పెడతారు.

my dear donga aha review telugu

మరొక పక్క, తర్వాత రోజు సుజాత బర్త్ డే అవ్వడంతో, సుజాత బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి (దివ్య శ్రీపాద), బుజ్జి బాయ్ ఫ్రెండ్ వరుణ్ (శశాంక్ మండూరి), సుజాత బాయ్ ఫ్రెండ్ విశాల్ ఆమె ఇంటికి వచ్చి సర్ప్రైజ్ ఇస్తారు. సురేష్ వెళ్ళిపోతాను అంటే సుజాత ఉండమని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఈ తరం వాళ్లు ఎలా ఉన్నారు, వాళ్లు ఆలోచన విధానం ఎలా ఉంది అనేది ఈ సినిమాలో చూపించారు. సుజాత పాత్రలో షాలిని చాలా బాగా నటించారు. ఆమె నటన చాలా అమ్మాయికంగా ఉంటుంది. రైటర్ కూడా తనే. కథ చాలా బాగా రాసుకున్నారు.

my dear donga aha review telugu

సింపుల్ పాయింట్ మీద సినిమా అంతా నడుస్తుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా సినిమా ఉంటుంది. చిన్న చిన్న ఆనందాలు జీవితంలో ఎంత ముఖ్యం అనేది ఇందులో చూపించారు. మిగిలిన నటీనటులు అందరూ కూడా బాగా నటించారు. కామెడీ కొంత వరకు వర్కౌట్ అయ్యింది. కొన్ని చోట్ల అంత పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. ఎమోషనల్ సీన్స్ కూడా ఇంకా బాగా రాస్తే బాగుండేది అనిపిస్తుంది. కెమెరా వర్క్ బాగుంది. పాటలు కూడా సినిమాకి తగ్గట్టు ఉన్నాయి. వీకెండ్ కి ఒక్కసారి చూడగలిగే ఒక మంచి టైం పాస్ ఎంటర్టైనర్ గా మై డియర్ దొంగ సినిమా నిలుస్తుంది.

ALSO READ : IAS ఆమ్రపాలి లవ్ స్టోరీ తెలుసా..? వీరి పరిచయం ఎలా మొదలయ్యింది అంటే..?


End of Article

You may also like