“రాధ” చనిపోయిందా..? ఆమె మరణాన్ని ఎందుకు రహస్యంగా ఉంచారు..?

“రాధ” చనిపోయిందా..? ఆమె మరణాన్ని ఎందుకు రహస్యంగా ఉంచారు..?

by kavitha

Ads

స్వ‌చ్ఛ‌మైన, ఆధ్యాత్మిక ప్రేమ‌కు రూపంగా రాధా కృష్ణుల ప్రేమ‌ను భావిస్తారు. వారి ప్రేమ భౌతికమైన ఆనందాలకు అతితమైంది. మహా విష్ణువు ద్వాపర యుగంలో ప్రేమ యొక్క అర్ధాన్ని తెలియచేయడానికే శ్రీకృష్ణుడుగా జన్మించాడని అంటారు.

Video Advertisement

రాధ యమునతీరం సమీపంలోని రావల్ గ్రామంలో వృషభానుడు, కీర్తి దంపతులకు జన్మించింది. ఆమె పుట్టినప్పటి నుండే రాధా కృష్ణుల ప్రేమకథ మొదలైంది. అయితే అనుకోని సంఘటనల వల్ల రాధ కృష్ణుడికి దూరం అవడం జరుగుతుంది. ఆ తరువాత రాధ ఏమైంది అనేది ఇప్పుడు చూదాం..
రాధా కృష్ణుల ప్రేమ‌ గురించి ఎన్నో రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఎనిమిది మంది భార్యలు, వేలాది మంది గోపికలు ఉన్న‌ప్ప‌టికీ కృష్ణుడి హృద‌యంలో రాధ‌కి ప్ర‌త్యేక స్థానం ఉంది. రాధ కృష్ణుడు త‌న కళ్ల ముందుకు వ‌చ్చే దాకా తన క‌ళ్లు తెర‌వ‌ననే ష‌ర‌తుతో  వృష‌భానుడు ఇంట్లో జన్మిస్తుంది. అతను రాధ అని పేరు పెట్టుకుని ఎంతో  ప్రేమగా పెంచుకుంటాడు. కానీ పాప పెరిగుతున్న క‌ళ్లు తెర‌వ‌క‌పోవ‌డంతో అటుగా వ‌చ్చిన నార‌ద మ‌హ‌ర్షితో విషయం చెబుతాడు. రాధ జ‌న్మ ర‌హ‌స్యం నార‌ద మ‌హ‌ర్షికి తెలిసి ఉండడటంతో  య‌శోదనందుల‌తోపాటుగా కృష్ణున్ని కూడా ఇంటికి పిలవమని చెబుతాడు.వృష‌భానుడు నందుని కుటుంబాన్ని తన ఇంటికి పిలవడంతో కృష్ణుడితో పాటుగా అత‌ని ఇంటికి వ‌స్తారు. శ్రీకృష్ణుడు రాధ‌ దగ్గరకి రావడంతో ఒక‌సారిగా రాధ క‌ళ్లు తెరుస్తుంది. ఆరోజు నుండి వారిరువురూ ఎంతో స‌న్నిహితంగా, ఎడబాటు  మెలుగుతుంటారు. బృందావనంలో కృష్ణుడు వేణు గానం చేస్తుండే రాధ తన్మయత్వంతో వింటూ ఉండేది. అలా వారు లేకుండా కొన్నేళ్ళు గడిపారు. అయితే కృష్ణుడు మేనమామ కంసున్ని చంపడానికి మ‌ధుర‌కు వెళ్లే ముందు రాధను కలిసి త‌న క‌ర్త‌వ్యాన్ని చెబుతాడు. విషయం అర్థం చేసుకున్న రాధ ఎంతో బాధ‌తో కృష్ణుడికి వీడ్కోలు పలుకుతుంది. కృష్ణుడు వెళ్ళే ముందుగా రెండు వాగ్ధానాలను అడుగుతుంది. ఒకటి రాధ మనసులో ఎప్పటికీ కృష్ణుడు మాత్రమే ఉండాలని, రెండు తన చివరి ఘడియాల్లో కృష్ణుడు తనకి దర్శనం ఇవ్వాలని చెబుతుంది. అలా కృష్ణుడి ఎట‌బాటుకు గుర‌వుతుంది. కృష్ణుడు దూరం కావడం వల్ల క‌న్నయ్య‌నే ధ్యానిస్తూ రాధ ఎప్పుడూ ప‌ర‌ధ్యానంలో ఉంటుంది.  అలా రాధ‌ను చూసి ఆమె త‌ల్లిదండ్రులు ఆమెకు ఇష్టం లేక‌పోయినా  ఒక యధావుడి తో పెళ్లి చేస్తారు. అయితే అతను రాధను తాకితే బూడిదగా మారిపోతాడానే శాపం ఉంటుంది. దాంతో ఆమె పెళ్లి తరువాత కూడా కృష్ణుడి ఆరాధనలో గడుపుతూ రాధ తన వైవాహిక బాధ్యతలను నిర్వర్తిస్తుంది. రాధ ఆఖరి గడియలు దగ్గర పడడంతో కృష్ణుడిని పిలుస్తుంది. అలా ఆమెను చూసి బాధపడి ఏమైనా వరం కోరుకోమని అడుగుతాడు. రాధ బృందావనంలో వేణుగానం ఆలపించే కృష్ణుడిని చూస్తు కన్నుమూయాలని ఉందని చెబుతుంది. ఆమె కోరిక మేరకు కృష్ణుడు వేణుగానం చేతస్తుండగా రాధ కన్నుమూస్తుంది. ఆ బాధతో కృష్ణుడు వేణువును విరుస్తాడు. వేణువుకు రాధకు విడదీయలేని అనుబంధం ఉంటుంది. ఆ కారణంతో కృష్ణుడు వేణువును ఎప్పుడూ తాకలేదని చెబుతారు.

Also Read: వాహనంని “నిమ్మకాయ” తొక్కించడం వెనక అసలు కథ ఇదే.! తెలియక ఇన్ని రోజులు గుడ్డిగా పాటిస్తున్నామా.?

 


End of Article

You may also like