Ads
భూమికి మధ్య సూర్యుడు వెళ్ళినప్పుడు భూమిపై దాని నీడ పడుతుంది దీనిని సూర్య గ్రహణం అని అంటారు. అదే ఒకవేళ చంద్రుడు సూర్యుని లో కొంత భాగాన్ని మాత్రమే అడ్డుకుంటే అప్పుడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ రోజు 65 శాతం సూర్యుడిని చంద్రుడు అడ్డుకోవటం జరుగుతుంది.
Video Advertisement
ఈ సూర్యగ్రహణం పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, దక్షిణ మరియు పశ్చిమ అమెరికా, అంటార్కిటికా ప్రాంతాల్లో కనబడుతుంది.
చిలి, ఉరుగ్వే, నైరుతి, బొలీవియా, పేరు, అర్జెంటీనా, బ్రెజిల్ లో కొన్ని ప్రాంతాలలో ఈ సూర్యగ్రహణం సంభవిస్తుంది. అయితే సూర్యగ్రహణం కలిగిందంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు. అయితే సూర్య గ్రహణానికి సంబంధించి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. మరి ఎక్కువగా వినపడే అపోహలు గురించి ఇప్పుడు చూద్దాం.
#1. అంధత్వం రావడం:
సూర్యగ్రహణాన్ని చూడటం వల్ల కంటికి హాని కలుగుతుందని.. సూర్యగ్రహణాన్ని చూడడం వల్ల అంధత్వం వచ్చే అవకాశం కూడా ఉంటుంది అని అంటూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు.
#2. ఆహార పదార్థాలు తీసుకోకూడదు:
కొంతమంది గ్రహణం వల్ల ఆహారం విషం అవుతుందని అంటుంటారు. అందుకని ఆ సమయంలో ఆహారాన్ని తీసుకోవద్దు అంటారు. కానీ నిజానికి ఏదైనా ఆహారాన్ని తినొచ్చు, తాగొచ్చు కూడా.
#3. గర్భిణీలకు మంచిది కాదు:
సూర్యగ్రహణాన్ని చూడడం వల్ల గర్భిణీలు కడుపులో ఉండే బిడ్డకి హాని కలుగుతుందని అంటూ ఉంటారు. ఇది కూడా నిజం కాదు. కేవలం అపోహ మాత్రమే.
#4. చెడు కలిగిస్తుంది:
గ్రహణం చెడు కలిగిస్తుందని పెద్దలంటూ ఉంటారు. కానీ గ్రహణం వల్ల అలా ఏమీ జరగదు. అయితే సూర్యగ్రహణం వల్ల మనిషికి కానీ, ఆరోగ్యపరంగా కానీ, ప్రకృతికి కానీ ఎలాంటి నష్టం కలుగుతుందని సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదు. అయితే మామూలుగా కళ్ళతో సూర్యగ్రహణాన్ని చూడటం మంచిది కాదు అంటారు కాబట్టి నేరుగా సూర్యగ్రహణాన్ని చూడకండి.
End of Article