‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు,కలెక్షన్స్ సాధించడమే కాక అవార్డులు కూడా సాధిస్తుంది. ఏకంగా ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో గత కొన్ని రోజులుగా ఆర్ఆర్ఆర్ యూనిట్ అమెరికాలోనే ఉంటూ సినిమాని మరింత ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నారు. రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, ఎన్టీఆర్, సెంథిల్ కుమార్, మరికొంతమంది చిత్రయూనిట్ అమెరికాలోనే ఉండి ఆస్కార్ అయ్యేవరకు సందడి చేయనున్నారు.

Video Advertisement

అక్కడి మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి, నాటు నాటు సాంగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేస్తున్నారు. రాజమౌళి ఇండియన్ సినిమాకు గ్లోబల్ మార్కెట్ తెచ్చేందుకు, ఎలాగైనా ఆస్కార్ సాధించాలని సినిమా ప్రమోషన్స్ కి ఖర్చుకి వెనకాడకుండా చేస్తున్నాడు. మన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ వరకు వెళ్లిందని అంతా సంతోషిస్తుంటే కొంతమంది మాత్రం విమర్శలు చేస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో టాలీవుడ్ సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆర్ఆర్ఆర్ యూనిట్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

nagababu comments on tammareddy bharadvaja..

“ఆర్ఆర్ఆర్ టీం ఆస్కార్ ప్రమోషన్స్ కోసం 80 కోట్లు ఖర్చుపెడుతున్నారు. సూట్లు వేసుకొని, ఫ్లైట్స్ టికెట్స్ వేసుకొని డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అదే 80 కోట్లు నాకు ఇస్తే ఓ 8 సినిమాలు తీసి మొహాన కొడతాను” అని అనడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే తమ్మారెడ్డి వ్యాఖ్యలపై నటుడు నాగబాబు కూడా కౌంటర్ ఇచ్చాడు. నాగబాబు కూడా తన ట్విట్టర్ లో.. “నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం” అంటూ ట్వీట్ చేయడంతో ఇది కూడా వైరల్ గా మారింది.

nagababu comments on tammareddy bharadvaja..

అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కూడా తమ్మారెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. రాఘవేంద్ర రావు తన ట్విట్టర్ లో.. “మిత్రుడు భరద్వాజ్ కి, తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకి ప్రపంచ వేదికలపై మొదటి సారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి. అంతే కానీ 80 కోట్ల ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా..? జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా ?” అంటూ ట్వీట్ చేశారు. వీరే కాకుండా మరింతమంది ప్రముఖులు కూడా తమ్మారెడ్డి వ్యాఖ్యలని విమర్శిస్తున్నారు.