విడాకుల తర్వాత మొదటిసారి ఒకే వేదికపై నాగ చైతన్య – సమంత…కానీ ట్విస్ట్ ఏంటంటే.?

విడాకుల తర్వాత మొదటిసారి ఒకే వేదికపై నాగ చైతన్య – సమంత…కానీ ట్విస్ట్ ఏంటంటే.?

by Harika

Ads

ఇద్దరూ కలిసి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా సమయంలో ప్రేమించుకొని, దాదాపు 10 సంవత్సరాలు ప్రేమలో ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్న జంట నాగ చైతన్య, సమంత. ఈ మధ్యలో వీరు ఆటోనగర్ సూర్య, మనం సినిమాల్లో కూడా కలిసి నటించారు. 2017 లో గోవాలో ఘనంగా వీరి పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ కలిసి మజిలీ సినిమాలో నటించారు. సమంత ముఖ్య పాత్రలో నటించిన ఓ బేబీ సినిమాలో కూడా నాగ చైతన్య ఒక స్పెషల్ అప్పియరెన్స్ లో కనిపిస్తారు.

Video Advertisement

5 reasons behind chaysam divorce

సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి ఫోటోలు షేర్ చేయడం, ఒకరి సినిమా విడుదల అవుతున్నప్పుడు ఇంకొకరు ఆల్ ది బెస్ట్ చెప్తూ పోస్ట్ చేయడం, ఇలాంటివి తరచుగా జరిగాయి.  సోషల్ మీడియాలో వీళ్ళు షేర్ చేస్తున్న ఫోటోలు చూసి వీళ్ళు ఆనందంగా ఉన్నారు అనుకొని, “ఇండస్ట్రీలో ఒక ఐడియల్ కపుల్ అంటే వీరే” అని చాలా మంది అభిప్రాయపడ్డారు. తర్వాత 2021 లో వీరిద్దరూ విడిపోతున్నట్టు ప్రకటించారు. అందుకు కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియదు. “అప్పటి వరకు బాగానే ఉన్నట్టు కనిపించారు. కానీ హఠాత్తుగా ఇలా విడిపోయినట్టు ప్రకటించారు ఏంటి?” అనే ప్రశ్న చాలా మందిలో నెలకొంది.

చాలా మంది అభిమానులని ఈ వార్త నిరాశకి గురి చేసింది. కొద్ది రోజుల తర్వాత ఇద్దరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నారు. అప్పటి నుండి, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వీరిద్దరూ ఒక్కచోట కూడా కలిసి కనిపించలేదు.  సాధారణంగా విడాకులు తీసుకున్న తర్వాత కూడా కొంత మంది జంటలు స్నేహితులుగా ఉండడం అనేది చూస్తూ ఉంటాం. కానీ వీరిద్దరూ ఒకరికి ఒకరు దూరంగానే ఉంటున్నారు అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు, అంటే దాదాపు విడిపోయిన మూడు సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరూ ఒకే వేదిక మీద కనిపించారు. కానీ కలిసి కాదు.

నిన్న అమెజాన్ ప్రైమ్ సంస్థ వారు విడుదల చేయబోతున్న సినిమాలు, వారు రూపొందించిన ఒరిజినల్ సిరీస్, ఒరిజినల్ సినిమాలు ప్రకటించారు.  సమంత, వరుణ్ ధావన్ నటించిన సిటాడెల్ సిరీస్ ప్రకటన నిన్న జరిగింది. ఇందుకోసం సిరీస్ బృందంతో కలిసి సమంత ఈ ఈవెంట్ కి హాజరు అయ్యారు. మరొక పక్కన నాగ చైతన్య గత సంవత్సరం నటించిన దూత సిరీస్ రెండవ సీజన్ రెన్యూ చేసుకుంది. ఈ వార్తని ప్రకటించడం కోసం దూత బృందంతో కలిసి నాగ చైతన్య ఇదే ఈవెంట్ కి హాజరు అయ్యారు.

sri reddy about naga chaitanya samantha divorce

ఇద్దరు వేరు వేరు సమయాల్లో ఈ ఈవెంట్ కి వెళ్లారు. వేరు వేరు సమయాల్లోనే స్టేజ్ మీద వారి సిరీస్ కి సంబంధించిన వివరాలని చెప్పారు. కానీ ఒకటే ఈవెంట్ కి ఇద్దరూ వెళ్లడం కూడా ఇప్పటి వరకు జరగలేదు. ఇన్ని సంవత్సరాలలో ఇదే మొదటి సారిగా జరిగింది. ఇంక సినిమాల విషయానికి వస్తే, సమంత నటిస్తున్న సినిమాలు కొన్ని చర్చల దశలో ఉన్నాయి. నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అవుతోంది.

ALSO READ : మిరపకాయ్ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.? ఇప్పుడు ఎక్కడుందంటారు?


End of Article

You may also like