రిజెక్ట్ చేసిన వారితో మళ్లీ స్నేహం చేయడం అంటే చిరాకు.. “నాగచైతన్య” కామెంట్స్ వైరల్..

రిజెక్ట్ చేసిన వారితో మళ్లీ స్నేహం చేయడం అంటే చిరాకు.. “నాగచైతన్య” కామెంట్స్ వైరల్..

by kavitha

Ads

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య తాజాగా నటిస్తున్న సినిమా “కస్టడీ”. ఈ చిత్రానికి కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా హీరోయిన్ కృతి శెట్టి నటిస్తోంది.

Video Advertisement

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు. ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య తాజాగా ఒక తమిళ యూట్యూబ్ ఛానల్‏కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో నాగచైతన్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. అవి ఏమిటో ఇపుడు చూద్దాం..
నాగచైతన్య  ప్రస్తుతం ‘కస్టడీ’ మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. సీనియర్ నటుడు అరవింద్ స్వామి ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. యాక్షన్ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం  మే 12 రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ ను కోలీవుడ్ లోనూ జోరుగా చేస్తున్నారు. తమిళ యూట్యూబర్ ఇర్ఫాన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య కెరీర్ మరియు వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఆడిన ట్రూత్ ఆర్ డేర్ గేమ్ లో రిలేషన్ షిప్ లో ఎప్పుడైనా తిరస్కరించబడ్డారా? అని నాగచైతన్య యాంకర్ ఇర్ఫాన్ ను అడిగారు. అతను దానికి సమాధానం చెప్తూ రెండున్నర సంవత్సరాల క్రితం ప్రేమించిన అమ్మాయి రిజెక్ట్ చేసిందని అన్నారు. అయితే మనం మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుదామని చెప్పిందని వెల్లడించాడు. అది వినగానే నాగచైతన్య ఒక్కసారి తిరస్కరించిన వారితో మళ్ళీ ఫ్రెండ్ షిప్ అంటేనే తనకు చిరాగ్గా అనిపిస్తుందని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
అలాగే ఇంటర్వ్యూలో యాంకర్ జీవితంలో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా అన్న ప్రశ్నకి, తనకు ఎటువంటి రిగ్రెట్స్ లేవని చైతన్య తెలిపారు. జీవితంలో ఎదురైన ప్రతి సంఘటనను పాఠంగా భావిస్తానని తెలిపాడు. దీనిపై కొంచెం వివరంగా చెబుతారా అంటే తన కెరీర్ లో నటించిన రెండు మూడు చిత్రాల విషయంలో తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోలేకపోయానని వెల్లడించాడు.


Also Read: ఈ వారం OTT లో రిలీజ్ అవుతున్న 15 సినిమాలు..! ఏ సినిమా / సిరీస్ ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

 


End of Article

You may also like