Thank You Review : థాంక్యూ సినిమాతో “నాగ చైతన్య” హ్యాట్రిక్ హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Thank You Review : థాంక్యూ సినిమాతో “నాగ చైతన్య” హ్యాట్రిక్ హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : థాంక్యూ
  • నటీనటులు : నాగ చైతన్య, రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్, ప్రకాష్ రాజ్.
  • నిర్మాత : దిల్ రాజు
  • దర్శకత్వం : విక్రమ్ కె కుమార్
  • సంగీతం : తమన్
  • విడుదల తేదీ : జూలై 22, 2022

Thank You Review : స్టోరీ 

సినిమా అంతా అభిరామ్ (నాగ చైతన్య) అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఉన్న అభిరామ్ తన యాప్ డెవలప్ చేసి పెద్ద స్థాయికి వెళ్లాలి అని యూఎస్ కి వెళ్తాడు. ఈ క్రమంలో అభిరామ్ ప్రియ (రాశి ఖన్నా) ని కలుస్తాడు. తర్వాత తాను అనుకున్నట్టే పెద్ద స్థాయికి ఎదుగుతాడు కానీ, అభిరామ్ వ్యక్తిత్వంలో చాలా మార్పులు వస్తాయి. తనలోని మంచి లక్షణాలు అన్నిటిని మెల్లగా కోల్పోవడం మొదలవుతుంది. అలాంటి సమయంలో అభిరామ్ తను ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం తను ఒక్కడు మాత్రమే కాదు అని, తన వెనకాల చాలామంది ఉన్నారు అని తెలుసుకుంటాడు. అభిరామ్ ఎక్కడ నుంచి ఏ స్థాయికి వెళ్ళాడు? ఆ క్రమంలో అభిరామ్ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడు? అభిరామ్, ప్రియ ఎలా కలిశారు? వారిద్దరి ప్రేమ కథ ఏంటి? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

Video Advertisement

naga chaitanya thank you movie review

రివ్యూ :

సినిమా నిడివి చాలా తక్కువ. దాదాపు 2 గంటల 9 నిమిషాలు ఉంటుంది. డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ అంటే మంచి ఫీల్ గుడ్ సినిమాలు చాలా బాగా హ్యాండిల్ చేయగలరు అని పేరు ఉంది. అందులోనూ నాగ చైతన్యతో సినిమా అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రలని పరిచయం చేస్తూ సాగిపోతుంది. అదేంటి అప్పుడే అయిపోయింది అని అనిపిస్తుంది. పెద్దగా కథ కూడా ఏమీ ఉన్నట్టు అనిపించదు. అసలు కథ అంతా సెకండ్ హాఫ్ లో ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ చాలా బాగా హైలైట్ అయ్యాయి. నిజంగా మనుషులు, వారి మధ్య ఉన్న బంధాలు వాటి విలువల గురించి విక్రమ్ కె కుమార్ రాసుకున్న సీన్స్ చాలా బాగున్నాయి.

naga chaitanya thank you movie review

అలాగే డైలాగ్స్ కూడా బాగా రిజిస్టర్ అయ్యేలాగా ఉన్నాయి. ఇంక పర్ఫామెన్స్ విషయానికి వస్తే, సినిమా మొత్తాన్ని నాగ చైతన్య తన భుజాలపై నడిపించారు అని చెప్పాలి. గత కొన్ని సినిమాల నుండి నాగ చైతన్య నటనలో కూడా చాలా పరిణితి కనిపిస్తుంది. సినిమాలో కూడా అలాగే మూడు వేరియేషన్స్ ఉన్న  పాత్రలో బాగా నటించారు. సినిమా సినిమాకి కూడా నటన విషయంలో కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో కానీ చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఒక సినిమాకి మరొక సినిమాకి పోలిక లేకుండా చూసుకుంటున్నారు. అందుకోసం ఆ పాత్ర బాగా రావడానికి నాగ చైతన్య కూడా బాగా కష్టపడుతున్నారు.

naga chaitanya thank you movie first review

అదంతా తెరపై కనిపిస్తోంది. హీరోయిన్లుగా నటించిన మాళవిక నాయర్, అవికా గోర్, రాశి ఖన్నా కూడా తమ పాత్రల్లో బాగా నటించారు. మరొక ముఖ్య పాత్రల్లో నటించిన ప్రకాష్ రాజ్, ఈ నగరానికి ఏమైంది హీరో సాయి సుశాంత్ కూడా తమ పాత్ర పరిధి మేరకు న్యాయం చేశారు. తమన్ సంగీతం సినిమాకి తగ్గట్టుగా ఉంది. పాటలు వినడానికి ఎంత బాగున్నాయో చూడడానికి కూడా అంతే బాగున్నాయి. అలాగే మహేష్ బాబు రిఫరెన్స్ ఉన్న సీన్స్ కూడా ఈ సినిమాలో చాలానే ఉంటాయి. సినిమాటోగ్రఫీ కూడా ఫ్రెష్ గా అనిపిస్తుంది. కానీ సినిమా నిడివి ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా హడావిడిగా అయిపోతుంది. కొంచెం నిడివి పెంచి, ఇంకా కొంచెం క్లియర్ గా చూపించి ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

Also Read: విడాకులపై మొదటిసారిగా మాట్లాడిన సమంత..! “మళ్లీ ప్రేమిస్తావా..?” అని అడిగితే..?

ప్లస్ పాయింట్స్ :

  • నాగ చైతన్య
  • డైలాగ్స్
  • సినిమాటోగ్రఫీ
  • ఎమోషన్స్

మైనస్ పాయింట్స్:

  • తక్కువ నిడివి ఉండడం
  • హడావిడిగా అనిపించే చాలా ఎపిసోడ్స్
  • ఫస్ట్ హాఫ్ లో బోరింగ్ గా అనిపించే కొన్ని సీన్స్
  • ఆల్రెడీ చూసిన కథ

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

టీజర్, ట్రైలర్ చూసి సినిమాపై అంచనాలను పెంచుకున్న వారిని థాంక్యూ సినిమా అస్సలు నిరాశ పరచదు. నాగ చైతన్య కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా థాంక్యూ సినిమా నిలుస్తుంది.


End of Article

You may also like