“అవి చూసాక.. కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయ్.. ఇకపై చైతూది కొత్త జర్నీ..”నాగార్జున ఎందుకింత ఎమోషనల్ అయ్యారు?

“అవి చూసాక.. కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయ్.. ఇకపై చైతూది కొత్త జర్నీ..”నాగార్జున ఎందుకింత ఎమోషనల్ అయ్యారు?

by Anudeep

Ads

లవ్ స్టోరీ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. కలెక్షన్ పరం గా కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవలే ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని హోటల్ ‘ట్రైడెంట్’లో ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. గెస్ట్ గా వచ్చిన నాగార్జున స్టేజి పై మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు. కరోనా మహమ్మారి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమర్ధవంతంగా ఎదుర్కొన్నాయన్నారు.

Video Advertisement

nagarjuna 1

రాష్ట్ర ముఖ్యమంత్రులు తీసుకున్న మంచి నిర్ణయాల వల్ల కరోనా బారినుండి బయటపడుతున్నామన్నారు. లవ్ స్టోరీ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి మొత్తం సినిమా ఇండస్ట్రీకి ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. “మంచి సినిమా థియేటర్ లో రిలీజ్ చెయ్యండి.. తప్పకుండ థియేటర్ కి వచ్చి చూస్తాం” అంటూ ప్రేక్షకులు కూడా ఆదరించారన్నారు. ప్రతి ప్రేక్షకుడికి నమస్కారాలు అంటూ స్టేజిపైనే చెప్పారు.

nagarjuna 2

ఈ సినిమా తరువాత మా అందరికి ధైర్యం వచ్చిందని, చాలా సంతోషం గా ఉంది అని చెప్పుకొచ్చారు. లవ్ స్టోరీ చాలా సున్నితమైన కథ అని.. సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ అంశాన్ని జాగ్రత్త గా డీల్ చేసి.. ఫన్ స్టోరీ ని సీరియస్ అంశాలవైపు మళ్లించారని చెప్పుకొచ్చారు. ఈ స్టోరీ కి కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించి శేఖర్ కమ్ముల అద్భుతం గా తీశారన్నారు. ఈ సబ్జెక్టు తనకు అంతగా నచ్చదు అనీ, కానీ శేఖర్ కమ్ముల చూపించిన విధానానికి కనెక్ట్ అయిపోయానని ఎమోషనల్ అయ్యారు.

nagarjuna 3

ఆ సన్నివేశాలు చూస్తుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయన్నారు. పవన్ కూడా ఎంతో చక్కని మ్యూజిక్ ని అందించారని, అశోక్ గారు ఇలాంటి సాహిత్యాలని మరింత గా అందించాలని కోరారు. సాయి పల్లవి డాన్స్ చూస్తే.. చుట్టూ వందమంది సాయి పల్లవులు ఉన్నట్లు అనిపించందన్నారు. మా చైతుని చూస్తే కడుపు నిండిపోయిందన్నారు. చైతన్య కి ఇక నుంచి కొత్త జర్నీ మొదలవుతుంది అంటూ ప్రశంసించారు.


End of Article

You may also like