ఈరోజులలో మనుష్యులలో ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది.భక్తి చానెల్స్ మరియు ప్రసంగాలు వినే వారిసంఖ్య గణనీయంగా పెరుగుతుంది.తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా చేరువైన ప్రవచన కర్తలలో ప్రముఖులు మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు గారు.ఈయన వృత్తి రీత్యా ఉదాధ్యాయుడిగా పని చేసారు.తెలుగు అధ్యాపకునిగా పలు కళాశాలల్లో పనిచేసారు.తర్వాత ప్రవచన కర్త గా మారి ప్రపంచ కీర్తి గడించారు.తెలుగు రాష్ట్రాలలోని కాకుండా ప్రపంచ నలుమూలలా ఈయనకు అభిమానులు ఉన్నారు.భగవద్గీత ,రామాయణం దగ్గర నుండి వేదాల వరకు అన్నింటి మీద ప్రసంగాలు ఇచ్చారు గరికపాటి నరసింహ రావు గారుస్.

భక్తి మార్గమే కాకుండా సామాజిక పరిస్థితులపై సమకాలీన ఉపనస్యాలు ఇవ్వడంలోగరికపాటి గారు ప్రముఖులు.విద్యార్థులకు కూడా మనో దైర్యం పెంచుకోవడంలోనూ ,మానసిక వికాసాన్ని పెంపొందించుకోవడంలోనూ కావలసిన విషయాలను బోధిస్తూ ఉంటారు .అయితే కొంతమందితో మాత్రం ఎటువంటి పరిస్థితులలోను కూడా గొడవ పెట్టుకోకూడదు అని గరికిపాటి గారు అంటున్నారు.అది ఎవరితోనో ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.వివరాల్లోకి వెళ్తే…

1. వంట చేసేవారితో

మొదటగా వంట చేసేవాడితో ఎప్పుడూ గొడవ పెట్టుకోకూడదు అంట ఎందుకంటే అతనితో ఏమైనా వివాదం అయితే ఆహారం రుచిగా ఉండకుండా చేసే అవకాశం ఉంది లేదా కారం లాంటివి ఎక్కువ వేస్తే తద్వారా ఆరోగ్యం చెడిపోతుంది .మారి ముఖ్యంగా ఆహారం లో విషం కలిపే అవకాశం కూడా ఉంటుంది అని గరికపాటి గారు తెలిపారు..

 

2. డబ్బున్న వాడితో

కపోతే డబ్బున్న వాడితో అసలు గొడవ పెట్టుకోకూడదు అంట.ఎందుకంటే డబ్బు ఉన్నవాడి దగ్గర రౌడీలు కూడా ఉంటారు.రాజకీయ నాయకులికి కూడా డబ్బు ఇచ్చి తమ అదుపులో పెట్టుకుంటారు.కావున అటువంటి వారితో వివాదం పెట్టుకుంటే ప్రాణాలు కూడా చాలా సులభంగా తీయించేస్తారు అని గరికపాటి గారు అన్నారు.

3. రాజు తో

రాజు తో అసలు తగాదా పెట్టుకోకూడదు అంట.ఎందుకంటే మొత్తం ప్రభుత్వం అంతా అతని అధీనంలో ఉంటుంది కాబట్టి అటువంటి వారితో వివాదం పెట్టుకుంటే ఏదో ఒక తప్పుడు అభియోగం మీద చెరసాలలో వేయిస్తారు అని తెలిపారు.

4. మంత్రి తో

మంత్రి తో అసలు వివాదం పెట్టుకోకూడదు అంట.ఈరోజుల్లో మంత్రి ఎవరు ఉంటారు అని అనుకుంటున్నారా.మంత్రి అంటే మనకు సలహాలు ఇచ్చేవారు.దుర్యోధనుడికి శకుని సలహాలు ఇవ్వడం వలెనే భారతంలో దుర్యోధుని జీవితం నాశనం అయింది .కాబట్టి మనకి సలహాలు ఇచ్చేవారితో బాగా సఖ్యంగా ఉండాలంటా.

 

 


తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగుఅడ్డా ఆహ్వానం.! Mail us your resume and samples to: teluguaddahr@gmail.com