“మా” రగడ పై షాకింగ్ కామెంట్లు చేసిన బాలయ్య.. “మంచు విష్ణు” తో కలిసి..??

“మా” రగడ పై షాకింగ్ కామెంట్లు చేసిన బాలయ్య.. “మంచు విష్ణు” తో కలిసి..??

by Anudeep

Ads

టాలీవుడ్ లో గత కొన్ని రోజులు గా “మా” ఎన్నికల నేపధ్యం లో వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ విషయమై బాలయ్య బాబు స్పందించారు. “మా” ఎన్నికల నేపధ్యం లో నందమూరి బాలకృష్ణ షాకింగ్ కామెంట్లు చేసారు. “మా” కమిటీ సభ్యులు అందరు కలిసి ఇప్పటివరకు ఒక్క బిల్డింగ్ ను ఎందుకు కట్టలేకపోతున్నారంటూ ఆయన ప్రశ్నించారు.

Video Advertisement

balayya 2

సాక్షి కధనం ప్రకారం.. “మా” సభ్యులను బాలయ్య బాబు నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం తో సన్నిహితం గానే మెలుగుతున్నారు. “మా” భవనం కోసం ఒక్క ఎకరం కేటాయించలేరా..? అంటూ మా సభ్యులను ప్రశ్నించారు. మనమందరం గ్లామర్ ఇండస్ట్రీ లో ఉన్నామని.. ఎన్నికల నేపధ్యం లో బహిరంగం గా చర్చలు జరపడం సమంజసం కాదని బాలయ్య బాబు పేర్కొన్నారు.

balayya

ఆర్టిస్ట్ లు ఎవరైనా… అసోసియేషన్ ఎన్నికలలో అందరు సమానమేనని ఆయన గుర్తు చేసారు. గతం లో ఫండ్ రైజింగ్ పేరిట “మా” సభ్యులు అమెరికా వెళ్లిన విషయాన్నీ కూడా బాలయ్య బాబు ప్రస్తావించారు. టాప్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ లలో అమెరికా కు వెళ్లి.. అక్కడ చేసిన కార్యక్రమాల ద్వారా సేకరించిన ఫండ్స్ ను ఏమి చేసారంటూ.. బాలయ్య బాబు నిలదీశారు. “మా” భవన నిర్మాణం కోసం మంచు విష్ణు ముందుకొస్తున్నారని, ఆయనతో కలిసి తాము కూడా సహకరిస్తామన్నారు. టాలీవుడ్ సినీ పెద్దలు చేతులు కలిపితే ఏకం గా ఇంద్రభవనమే కట్టుకోవచ్చని అన్నారు.


End of Article

You may also like