నందమూరి బాలకృష్ణ పెళ్లి కార్డ్ చూసారా..? ఏం రాసి ఉందంటే..?

నందమూరి బాలకృష్ణ పెళ్లి కార్డ్ చూసారా..? ఏం రాసి ఉందంటే..?

by Mohana Priya

నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ఎన్నో దశాబ్దాల నుండి ఎన్నో రకమైన సినిమాలు, చేసి తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరో స్థాయికి ఎదిగారు నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణ సినీ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. ఎన్నో ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి.

Video Advertisement

కానీ ప్రతి సినిమాకి ఏదో కొత్తదనాన్ని చూపించడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. ఇటీవల ఎక్కువగా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు. అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో రెండిట్లోనూ తనదైన ముద్ర ఏర్పరచుకున్నారు.

nandamuri balakrishna vasundhara devi wedding card

తెలుగు ఇండస్ట్రీలో సినీ దిగ్గజాల్లో ఒకరిగా ఎదిగారు. అయితే నందమూరి బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమా బాబీతో చేస్తున్నారు. సినిమా షూటింగ్ అవుతున్నట్టు సమాచారం. సినిమాకి సంబంధించి ఇంకా మిగిలిన వివరాలు ఏవి బయటికి రాలేదు. అయితే బాలకృష్ణ 1982 డిసెంబర్ 8వ తేదీన వసుంధరాదేవిని పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది.

nandamuri balakrishna vasundhara devi wedding card

ఈ పెళ్లి పత్రికలో పరిణయ లేఖ అని రాసి దేవరపల్లి సూర్యరావు, దేవరపల్లి ప్రమీలారాణి ద్వితీయ కుమార్తె అయిన వసుంధర దేవిని బాలకృష్ణకి ఇచ్చి చేస్తున్నట్టు ఈ ఆహ్వాన పత్రికలో రాసి ఉంది. అంతే కాకుండా, వీరి పెళ్లి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిని, కర్ణాటక కళ్యాణ మండపంలో జరిగినట్టు ఈ పెళ్లి పత్రిక చూస్తే తెలుస్తోంది. బాలకృష్ణ పెళ్లి బాధ్యతని ఎన్టీఆర్ నాదెండ్ల భాస్కరరావుకి అప్పగించారు. నాదెండ్ల భాస్కరరావు ఈ సంబంధం కుదిరించారు అనే ఒక వార్త కూడా ఉంది.

nandamuri balakrishna vasundhara devi wedding card

బాలకృష్ణ, వసుంధరాదేవి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు బ్రాహ్మణి, తేజస్విని, మోక్షజ్ఞ తేజ. నారా బ్రాహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. నందమూరి తేజస్విని కూడా క్రియేటివ్ ఫీల్డ్ లోనే ఉన్నట్టు సమాచారం. నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

ALSO READ : అంత పెద్ద నటుడిని ఈ పరిస్థితిలో ఇలా చేయడం అవసరమా..? ఎవరో తెలుసా..?


You may also like

Leave a Comment