DEVIL REVIEW : “నందమూరి కళ్యాణ్ రామ్” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

DEVIL REVIEW : “నందమూరి కళ్యాణ్ రామ్” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

ప్రతి సినిమాకి ఒక కొత్త కాన్సెప్ట్ తో, ఒక డిఫరెంట్ పాత్రతో ప్రేక్షకుల ముందుకి వస్తున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఇప్పుడు పిరియాడికల్ డ్రామా అయిన డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : డెవిల్ – ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్
  • నటీనటులు : నందమూరి కళ్యాణ్ రామ్, సత్య, సంయుక్త మీనన్.
  • నిర్మాత : అభిషేక్ నామా
  • దర్శకత్వం : అభిషేక్ నామా
  • సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్
  • విడుదల తేదీ : డిసెంబర్ 29, 2023

devil movie review

స్టోరీ :

ఒక ఊరిలో రాజు కుటుంబానికి చెందిన విజయ అనే ఒక అమ్మాయి చనిపోతుంది. ఆ అమ్మాయి చనిపోవడానికి గల కారణాలు ఎవరికీ తెలియదు. దాంతో ఈ కేస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి మద్రాస్ నుండి ఏజెంట్ డెవిల్ (నందమూరి కళ్యాణ్ రామ్) వస్తాడు. ఏజెంట్ డెవిల్ కి చాలా మంది మీద అనుమానాలు మొదలు అవుతాయి. అదే ఊరిలో నైషధ (సంయుక్త మీనన్) కూడా ఉంటుంది. అసలు విజయ ఎలా చనిపోయింది? ఆమెను ఎవరు చంపారు? డెవిల్ ఈ కేస్ ని ఎలా ఛేదించాడు? అతను ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

devil movie review

రివ్యూ :

ఈ సంవత్సరం మొదట్లో అమిగోస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు కళ్యాణ్ రామ్. సినిమా కాన్సెప్ట్ బాగానే ఉన్నా కూడా టేకింగ్ విషయంలో కొన్ని పొరపాట్లు జరగడంతో సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు టైం తీసుకుని డెవిల్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కూడా ఎన్నో కారణాల వల్ల వాయిదా పడి ఇప్పుడు వచ్చింది. మొదట ఈ సినిమాకి నవీన్ మేడారం దర్శకత్వం వహించారు.

devil movie review

కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుండి తప్పుకోవడంతో ప్రొడ్యూసర్ అభిషేక్ ఈ సినిమాకి దర్శకత్వం వహించి రిలీజ్ చేశారు. సినిమా స్టోరీ పాయింట్ బాగుంది. పిరియాడికల్ డ్రామాలకి ఈ మధ్య మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా కూడా ఇదే కేటగిరీకి చెందుతుంది. సినిమా టెక్నికల్ గా చాలా బాగుంది. అప్పటి కాలాన్ని తలపించేటట్లు వాడిన సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్ అన్నీ కూడా బాగున్నాయి. కానీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా బోరింగ్ గా ఉంటుంది.

devil movie review

అలాంటి సీన్స్ ఇంకా ఆసక్తి క్రియేట్ చేసేలాగా రూపొందించే అవకాశం ఉంది. కానీ టేకింగ్ వల్ల కొన్ని సీన్స్ మీద ఇంట్రెస్ట్ పోతుంది ఏమో అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ సహనానికి పరీక్ష పెడతాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్ట్ లు ఉన్నా కూడా పెద్దగా ఆసక్తికరంగా అనిపించవు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత గొప్పగా ఏమీ లేవు. సినిమాలో ఉన్న వాళ్ళు అందరూ కూడా నిరూపించుకున్న నటీనటులు.

devil movie review

దాంతో ప్రతి వాళ్లు తమ పాత్ర వరకు తాము బానే చేశారు. విరూపాక్ష, సర్ తర్వాత హీరోయిన్ సంయుక్త నటించిన సినిమా ఇది. తన పాత్ర పరిధి మేరకు తను బానే నటించారు. టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ లో నిర్మాణ విలువలు తెలుస్తున్నాయి. సౌందర్ రాజన్ అందించిన సినిమాటోగ్రఫీ మరొక ప్లస్ పాయింట్ అవుతుంది. ఆ కాలానికి తగ్గట్టు కలర్ గ్రేడింగ్ వాడారు. అది చాలా బాగా అనిపించింది. కానీ స్క్రీన్ ప్లే మాత్రం ఇంకా చాలా మెరుగ్గా ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • నిర్మాణ విలువలు
  • స్టోరీ పాయింట్
  • సినిమాటోగ్రఫీ
  • సెట్టింగ్స్

మైనస్ పాయింట్స్:

  • బలహీనమైన స్క్రీన్ ప్లే
  • సహనానికి పరీక్ష పెట్టే సీన్స్

రేటింగ్ :

2/5

ట్యాగ్ లైన్ :

కొన్ని సినిమాలు మంచి కాన్సెప్ట్ తో వచ్చినా కూడా టేకింగ్ పరంగా కొన్ని పొరపాట్లు జరగడంతో సినిమాలు అంత పెద్దగా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉండవు. ఈ సినిమా కూడా అలాంటిదే. స్క్రీన్ ప్లే ఎలా ఉన్నా పర్వాలేదు, స్టోరీ పాయింట్ కోసం సినిమా చూద్దాం అనుకునే వారికి డెవిల్ సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : ఇప్పటి వరకు చూడని యంగ్ రెబల్ స్టార్ “ప్రభాస్” అరుదైన ఫోటోలు..!


End of Article

You may also like