నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చారు. అందులో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోల స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. కళ్యాణ్ రామ్ కూడా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే మరో హీరో కూడా నందమూరి కుటుంబం నుంచి వచ్చాడు. కానీ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. అతడే తారకరత్న.. సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహన కృష్ణ తనయుడే తారక రత్న.

Video Advertisement

తారకరత్నకు ఆశించిన ఫలితాలు రాక ప్రస్తుతం సినిమాలు తగ్గించేశారు. అయితే ఈయనకు ఒక రికార్డు ఉంది. ఒకేసారి 9 సినిమాలతో ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించాడు నందమూరి తారకరత్న. అప్పట్లో ఇదో సంచలనం. ఎందుకంటే హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే అన్ని సినిమాలతో రావడం అంటే చిన్న విషయం కాదు. కానీ తారకరత్న విషయంలో ఇదే జరిగింది. 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో వచ్చాడు తారక్. ఆ సినిమాతో పాటు మరో 8 సినిమాలను కూడా ఒకేరోజు మొదలు పెట్టారు. కేవలం 20 ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాడు తారకరత్న. వచ్చీ రావడంతోనే 9 సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

latest look of hero tarakaratna..!!

అయితే ఆరేడు నటించిన సినిమాలన్నీ ప్లాప్ కావడం తో చాలా కాలం సినిమాల్లో కనిపించలేదు తారకరత్న. ఆ తర్వాత పలు చిత్రాల్లో విలన్ గా కూడా నటించాడు. 20 కి పైగా సినిమాల్లో నటించినా కూడా ఇప్పటి వరకు సరైన హిట్ రాలేదు తారకరత్నకు. ఇటీవల సారధి చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు కానీ ఆ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అయితే తాజాగా తారక రత్న ఫోటోలని చూసిన ఫాన్స్ షాక్ అవుతున్నారు.

latest look of hero tarakaratna..!!
స్టైలిష్ లుక్ తో ఉన్న తారకరత్న ఫొటోస్ తాజాగా సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ కొత్త లుక్ లో అతడు చాలా బావున్నాడని నందమూరి ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచి నటుడైన తారక రత్నకు సరైన హిట్ పడితే కెరీర్ పుంజుకుంటుందని వారు భావిస్తున్నారు. ఇకపోతే ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తారకరత్న ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. మంచి మంచి అవకాశాలు వస్తే ఇతర హీరోల సినిమాల్లో విలన్ పాత్రల్లో, సహాయక పాత్రల్లో నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు తారకరత్న. సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన తారకరత్న ఇప్పుడైనా మరిన్ని సక్సెస్ లు అందుకోవాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు.