Ads
ఎక్కడికి పోతావు చిన్నవాడా, శ్రీనివాస కళ్యాణం వంటి సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న నటి నందిత శ్వేత. ఇప్పుడు మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. నందిత శ్వేత, వైభవ్, తాన్య హోప్ ముఖ్య పాత్రల్లో నటించిన రణం – అరమ్ తవరెల్ అనే సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. తమిళ్ హీరో పొందిన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే శివ (వైభవ్) ఒక ఫేస్ రీ-కన్స్ట్రక్షన్ ఆర్టిస్ట్. అంతే కాకుండా ఒక క్రై-మ్ సీన్ రైటర్ కూడా.
Video Advertisement
హ-త్యల్లో ఎప్పుడైనా ముఖాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నప్పుడు శివ పోలీసులకి సహాయపడతాడు. శివ, కావ్య అనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ తర్వాత అనుకోకుండా కావ్య చనిపోతుంది. అదే ప్రమాదంలో శివకి కూడా దెబ్బ తగులుతుంది. ఆ యాక్సిడెంట్ తర్వాత నుండి ఏదైనా అనుకోని పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం సేపు కదలిక లేకుండా అలా ఉండిపోతాడు. అయితే ఒకసారి మాధవరం పోలీస్ స్టేషన్ దగ్గర ఒక వ్యక్తి శ-వా-నికి సంబంధించి కాళ్లు దొరుకుతాయి. ఆ వ్యక్తికి సంబంధించిన భాగాలని కాల్చి కొన్ని బాక్సులలో పెట్టి ఒక్కొక్క చోట వాటిని పెడతారు. ఇవన్నీ వారికి దొరుకుతాయి. ప్రతి బాక్స్ లో సగం కాలిపోయిన ప్లాస్టిక్ మాస్క్ ఒకటి ఉంటుంది.
ఈ కేసు ఎలా సాల్వ్ చేశారు అనేది మిగిలిన కథ. ఇందులో ఇందూజ అనే పాత్రలో తాన్య హోప్ నటించగా, కల్కి అనే పాత్రలో నందిత శ్వేత నటించారు. సినిమా మొత్తం సస్పెన్స్ మీద నడుస్తుంది. చాలా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో మనకి ఇలాంటి కొన్ని సీన్స్ చూసినట్టు అనిపిస్తాయి. కథ బాగుంది. కానీ లాజిక్స్ మాత్రం చాలా చోట్ల మిస్ అయినట్టు అనిపిస్తాయి. నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. తాన్య హోప్ పాత్ర అంత బాగా రాసుకోలేదు అనిపిస్తుంది. కానీ తనకి ఇచ్చిన పాత్ర పరిధి మేరకు తాన్య హోప్ నటన మాత్రం బాగుంది. నందిత శ్వేత కల్కి అనే పాత్రలో బాగా నటించారు. కాస్త లాజిక్స్ కి దూరంగా ఉన్నా కూడా ఈ సినిమా ఒక్కసారి చూడగలిగే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా నిలుస్తుంది.
ALSO READ : SRH కెప్టెన్ తో మహేష్ బాబు…ఇద్దరి మధ్య ఎంత వయసు తేడా ఉందో తెలుసా.?
End of Article