Nani: రిజల్ట్ ఎలా ఉన్నా… నాని సినిమాలు అలాగే ఉండబోతున్నాయా..?

Nani: రిజల్ట్ ఎలా ఉన్నా… నాని సినిమాలు అలాగే ఉండబోతున్నాయా..?

by Anudeep

Ads

టాలీవుడ్ లో మన పక్కింటి కుర్రాడు పాత్రల్లో కనిపించే అతి తక్కువ మంది హీరోల్లో మొదటి స్ధానంలో ఉంటాడు నాచురల్ స్టార్ నాని.

Video Advertisement

ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకుల్ని మెప్పించడానికి తన ప్రయత్నం చేస్తుంటాడు.ఈ ప్రయత్నాల్లో మెజారిటీ సినిమాలు విజయవంతం అయినప్పటికీ, కొన్ని అపజయాలు కూడా నాని ని పలకరించాయి.

ఈ మధ్య కాలం లో చూస్తే 2018 లో విడుదలైన జెర్సీ సినిమా తర్వాత, ఆ స్ధాయి విజయం నాని కి దక్కలేదు.తర్వాత రిలీజైన గ్యాంగ్ లీడర్ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. భారీ అంచనాల నడుమ ఓ.టి.టి లో రిలీజైన ‘వి’ కూడా సాధారణ సినిమా గానే మిగిలిపోయింది. ఆ తర్వాత నాని కెరీర్ లో నిన్ను కోరి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వం లో ఓ.టి.టి లో రిలీజైన “టక్ జగదీష్” కూడా అంతగా ఆకట్టుకోలేకపోయినా  నాని పెరఫార్మెన్స్ కి మంచి మార్కులే పడ్డాయి.

ఇటువంటి కష్ట సమయం లో కూడా నాని రొటీన్ సినీమా ల జోలికి పోకుండా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో విభిన్న మైన కధ తో “శ్యామ్ సింగరాయ్” గా థియేటర్ లకి వచ్చి హిట్ కొట్టాడు. ఆంధ్ర లో టికెట్ రేట్ తగ్గించడం లాంటి ప్రతికూల పరిస్ధితుల్లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. అదే జోష్ లో మెంటల్ మదిలో ,బ్రోచేవారేవరు రా లాంటి డిఫరెంట్ సినిమాల తో ప్రేక్షకుల్ని అలరించిన వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో ‘అంటే సుందరానికి’ అనే మరో కొత్త కధ తో మరొక హిట్ ను నాని తన ఖాతా లో వేసుకున్నాడు.

ఇటీవలే విడుదలైన ఈ సినిమా యూత్ ను, ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.ఇదే ఊపు లో మాస్ ఆడియెన్స్ టార్గెట్ గా రాబోతున్న తర్వాత చిత్రం ‘దసరా’ కూడా సూపర్ హిట్ అయ్యి నాని హ్యాట్రిక్ కొట్టాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.


End of Article

You may also like