ప్రముఖ నటుడు విజయ కృష్ణ నరేష్ అలియాస్ వికే నరేష్ తన నిజ జీవిత భాగస్వామి పవిత్ర లోకేష్ జంటగా నటించిన చిత్రం మళ్ళీ పెళ్లి. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాకి. నరేష్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

  • చిత్రం : మళ్ళీ పెళ్లి
  • నటీనటులు : నరేష్, పవిత్ర లోకేష్, శరత్ బాబు, జయసుధ, అనన్య నాగల్ల, అన్నపూర్ణ, భద్రమ్.
  • నిర్మాత : నరేష్
  • దర్శకత్వం : ఎం.ఎస్. రాజు
  • సంగీతం : సురేష్ బొబ్బిలి
  • సినిమాటోగ్రఫి : బాల్ రెడ్డి
  • విడుదల తేదీ : మే 26, 2023

Malli pelli movie-story-review-rating

స్టోరీ:

నరేష్, పవిత్ర లోకేష్ బంధం గురించి ఈ మధ్య కాలంలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో మళ్ళీ పెళ్లి చిత్రాన్ని తీశారు. నరేష్ జీవితంలోని కాంట్రవర్సీలతో ఈ కథ సాగింది. ఒక పెద్ద కుటుంబం లోని సీనియర్ హీరోకి నరేంద్ర ( నరేష్), అతని సహనటి పార్వతి (పవిత్ర)కి మధ్య చిగురించిన ప్రేమ నేపథ్యం లో ఈ సినిమా జరుగుతుంది.

malli pelli review

వీరిద్దరికి అంతకు ముందే పెళ్లిళ్లు అయిన నేపథ్యం లో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు. నరేంద్ర మూడో భార్య సౌమ్య సేతుపతికి మధ్య మనస్పర్థలు, నరేంద్ర -పార్వతి ఓ హోటల్ లో దొరకడం, అది మీడియాలో రావడం వంటి సంఘటనలతో ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి అన్నదే మిగతా కథ.

రివ్యూ :

ఈ సినిమా నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కడంతో ముందు నుంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో నరేష్, పవిత్ర లోకేష్, వనిత అద్భుతంగా నటించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే సినిమా మొత్తం నరేష్ కోణంలో చూపించారు. ఇప్పటి వరకు జరిగిన చర్చలకి మరొక కోణంలో ఆలోచిస్తే ఎలా ఉంటుందో అనేది ఈ సినిమాలో చూపించారు.

Malli pelli movie-story-review-rating

అంతే కాకుండా ఈ సినిమాలో పవిత్ర లోకేష్ పోషించిన పార్వతి పాత్ర వ్యక్తిగత జీవితం గురించి కూడా చూపించారు. రచయిత, నటుడు అయిన తన భర్తతో పార్వతి జీవితం ఎలా ఉండేది అనేది ఈ సినిమాలో చూపించారు. కథ చాలా వరకు మనకి తెలిసినదే అయినా కూడా వారి పరిచయం ఎలా ఏర్పడింది అది ప్రేమగా ఎలా మారింది అనే విషయాలని ఈ సినిమాలో చూపించారు.

malli pelli review

కానీ ఏదేమైనా ఒకరిపై ఒకరు దుర్భాషలాడడం, సౌమ్యకి, నరేంద్రకి మధ్య వచ్చే సన్నివేశాలు, అందులో కొన్ని చోట్ల వచ్చే డైలాగ్స్ మాత్రం ప్రేక్షకులకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటినటులు ఉన్నారు. అలాగే కృష్ణ, విజయ నిర్మల పాత్రలని కూడా ఈ సినిమాలో చూపిస్తారు. తెరపై చాలా వరకు పేర్లు మార్చినా కూడా వారు నిజ జీవితంలో ఎవరు అనేది చూసే ప్రేక్షకులకి అర్థం అయ్యేలాగానే ఉంటుంది.

malli pelli review

ఇంటర్వెల్ కి అరగంట ముందు సినిమా ప్రేక్షకులకి ఆసక్తి కలిగించేలా ఉంటుంది. కొన్ని ట్విస్ట్ లు, ఎమోషనల్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉంటుంది. సెకండ్ హాఫ్ లో నరేష్, పవిత్ర మధ్య వచ్చే ప్రేమ కథ బాగుంది. క్లైమాక్స్ మాత్రం సూపర్ అనే చెప్పాలి. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ బీజీఎం బాగానే ఉంది.

ప్లస్ పాయింట్స్ :

  • ప్రధాన పాత్రల నటన
  • ఆకట్టుకొనే లవ్ స్టోరీ
  • క్లైమాక్స్ లో వచ్చే సీన్స్

Malli pelli movie-story-review-rating
మైనస్ పాయింట్స్ :

  • సాగదీసినట్టు ఉన్న కొన్ని సీన్స్
  • కథ కల్పితం కావడం వల్ల కొన్ని చోట్ల మిస్ అయిన క్లారిటీ
  • ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎపిసోడ్స్
    Malli pelli movie-story-review-rating

రేటింగ్ :

2.5/5

ట్యాగ్ లైన్:

నిజజీవితంలో జరిగిన సంఘటనలని కొంచెం కల్పితం యాడ్ చేసి సినిమాలో చూపించారు. సినిమా చుట్టూ అల్లుకున్న చర్చలని పక్కన పెట్టి, కేవలం సినిమాని ఒక సినిమాలాగా చూస్తే, ముఖ్య పాత్రలో నటించిన ఇద్దరూ కూడా చాలా మంచి నటులు కాబట్టి, నటీనటుల పర్ఫార్మెన్స్ కోసం సినిమా చూడాలి అనుకునే వారికి ఈ సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.

Watch trailer: