నటసింహ నందమూరి బాలకృష్ణ ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య నటిస్తున్న 108వ మూవీ ఇది. త్వ‌ర‌లోనే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కానుంది.

Video Advertisement

 

 

అయితే బాలకృష్ణ బర్త్డే సందర్భంగా ఆయన 109 వ చేతిరానికి సంబంధించిన ప్రకటన వస్తోందని తెలుస్తోంది. బాల‌కృష్ణ నెక్ట్స్ మూవీని ఎవ‌రితో చేస్తార‌నే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. NBK 109 రేసులో బోయ‌పాటి శ్రీను స‌హా ప‌లువురు డైరెక్ట‌ర్స్ పేర్లు వినిపించాయి. కానీ చివరికి ఈ అవకాశం యంగ్ డైరెక్టర్ బాబీ కొట్టేసాడు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య చిత్రం తో హిట్ కొట్టిన బాబీ.. బాలయ్య తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

NBK109 director fixed..!!

వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు ఉండ‌టంతో బాల‌య్య‌, బోయ‌పాటి కాంబోలో సినిమా ఉంటుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ బాబీ బాల‌కృష్ణ‌తో పొలిటిక‌ల్ మూవీ చేయ‌బోతున్నారు. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు ముందు సెప్టెంబ‌ర్‌లో NBK 109ను రిలీజ్ చేసేలా ప్లానింగ్ జ‌రిగింద‌ని సమాచారం. ఈ చిత్రానికి సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నాగ‌వంశీ నిర్మాత. నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన‌రోజు జూన్ 10. ఈ సంద‌ర్భంగా NBK 109కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానున్నట్లు తెలుస్తోంది.

NBK109 director fixed..!!

సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాత నాగ వంశీ ట్విట్టర్లో జూన్ 10 తేదీన.. అంటు సింహం ఇమేజిని షేర్ చేయడం జరిగింది. ఈ కాంబోలో సెట్ అయ్యి కొన్ని నెలలు అవుతోంది ..కానీ కొన్ని కారణాలవల్ల అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. దీంతో ఇప్పుడు ఈ చిత్రం పై అంచనాలు పెరిగిపోయాయి.

NBK109 director fixed..!!

ఇక NBK 108 విష‌యానికి వ‌స్తే అనీల్ రావిపూడి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో బాల‌కృష్ణ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. యంగ్ హీరోయిన్ శ్రీలీల ఒక కీల‌క పాత్ర‌లో కనిపించనుంది. ఈ మూవీలో అర్జున్ రాంపాల్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ద‌స‌రా సంద‌ర్బంగా ఈ చిత్రం రిలీజ్ కానుంది.

Also read: “గుంటూరు కారం” తో పాటు ఈ 5 మహేష్ బాబు సినిమాలకి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా..?