దర్శకధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా వ‌స్తుందంటే.. సూప‌ర్ హిట్ అవుతుంద‌ని ప్రేక్ష‌కులు ముందే డిసైడ్ అయిపోతారు. సినిమా హిట్ గురించి ఆలోచించకుండా.. జ‌క్క‌న్న నుంచి ఇదివ‌ర‌కు వచ్చిన సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుందా? లేదా అని మాత్ర‌మే మాట్లాడుకుంటారు. అంతలా ఆయన క్రేజ్ సంపాదించుకున్నారు. మ‌గ‌ధీర సినిమాతో రికార్డులు మొదలెట్టిన రాజ‌మౌళి.. బాహుబ‌లితో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. ఇక జ‌క్కన్న ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌ల వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది.

Video Advertisement

అయితే రాజమౌళి అంతకు ముందు సినిమాలు కూడా సూపర్ హిట్ అయినప్పటికీ బాహుబలితో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి ప్రపంచం ద్రుష్టి మొత్తం టాలీవుడ్ పై పడింది. అయితే ఈ క్రేజ్ పెరగటం తో పలువురు తెలుగు సినిమా పై, తెలుగు దర్శకులపై ట్రోల్ల్స్ చేయడం స్టార్ట్ చేసారు. రాజమౌళి పై గతం లో కొన్ని ట్రోల్స్ వచ్చాయి.. లాజిక్ లేకుండా తీస్తున్నాడు, హాలీవుడ్ సినిమాల సీన్లు కాపీ కొడుతున్నాడు, స్టార్ల తోనే సినిమాలు తీస్తాడు అంటూ ట్రోల్ చేసేవారు.

is rajamouli over rated..??

అయితే మరోసారి రాజమౌళి పై అక్కసు వెళ్లగక్కుతున్నారు కొందరు. రాజమౌళి కి అంత సీన్ లేదు.. ఎందుకు అందరు అతడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు అంటూ ఒక నెటిజన్ ప్రశ్నించగా.. “రాజమౌళి తాను సినిమా తీసే ముంచే క్లియర్ గా చెప్తున్నాడు అవి ఫిక్షన్ సినిమాలు అని.. అలాగే అతడు తన క్రియేటివిటీ ని చూపిస్తున్నాడు.. లాజిక్స్ ని ప్రూవ్ చెయ్యాలి అని కాదు. అలాగే అతడు కేవలం స్టార్లతో నే సినిమాలు తియ్యడు. సునీల్, నాని, నితిన్ వంటి హీరోలతో సినిమాలు తీసి సూపర్ హిట్స్ చేసాడు రాజమౌళి.” అని ఒక నెటిజన్ బదులిచ్చాడు.

is rajamouli over rated..??

మరొక నెటిజన్ ఆ ప్రశ్నకు బదులిస్తూ.. ” ఎందుకు అందరు తెలుగు టెక్నిషియన్స్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇతడికి తన క్రియేటివిటీ వల్ల ఇంత క్రేజ్ వచ్చింది.. అది ఊరికే రాలేదు. కానీ ఇంకా చాలా మంది ఫేమస్ డైరెక్టర్స్ ఉన్నారు కదా. వారికీ కూడా పేరు ఎలా వచ్చిందని మీరు ప్రశ్నించండి. ” అంటూ చెప్పారు.