ఉగాది పంచాంగం చూసి… నెటిజన్ చేసిన కామెంట్ చూస్తే నవ్వాపుకోలేరు..! పగ బట్టేసింది అంటూ..?

ఉగాది పంచాంగం చూసి… నెటిజన్ చేసిన కామెంట్ చూస్తే నవ్వాపుకోలేరు..! పగ బట్టేసింది అంటూ..?

by Mohana Priya

Ads

సాధారణంగా భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత ఇచ్చేది పండగలకి. పండగలని మన దేశంలో ఎంత బాగా జరుపుకుంటారో అందరికీ తెలుసు. అసలు అలాంటి వేడుకలకి భారతదేశం అనేది పెట్టింది పేరు. ఇటీవల ఉగాది పండుగ జరిగింది. దేశవ్యాప్తంగా ఎన్నో రకాల పేర్లతో ఉగాదిని పిలుస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఉగాది అని పిలుస్తారు. ఉగాది పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. సోషల్ మీడియా అంతా కూడా ఉగాది విషెస్ తో నిండిపోయింది. ఎంతో మంది స్నేహితులు, ఆప్తుల మధ్యలో ఈ పండుగని జరుపుకున్నారు. ఉగాది పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి.

Video Advertisement

ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి. ముందుగా ఏ రుచి అయితే తగులుతుందో, ఆ సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటుంది అని నమ్ముతారు. ఉగాది పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ లో తయారు చేస్తారు. పానకం, వడపప్పు ఇంకా మిగిలిన వంటకాలని ఉగాది రోజు చేసుకుంటారు. ఉగాది అంటే ఉగాది పచ్చడి మాత్రమే కాకుండా మరొకటి కూడా ముఖ్యంగా ఉంటుంది. అదే ఉగాది పంచాంగ శ్రవణం. ఉగాది అంటే తెలుగు వారి న్యూ ఇయర్. కాబట్టి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి కాబట్టి ఉగాది పంచాంగ శ్రవణం ఉంటుంది.

ugadi-festival-importace2

పేపర్లలోనూ, టీవీలలోనూ, యూట్యూబ్ ఛానల్స్ లోను ఎంతో మంది జ్యోతిష్యులు ప్రతి రాశి వారికి ఉగాది ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్తారు. ఈ పంచాంగ శ్రవణాన్ని ప్రతి రాశి వారికి ఆదాయం, వ్యయం, అవమానం, రాజపూజ్యం పేర్లతో విభజిస్తారు. ఆదాయాలు ఎంత ఉంటాయి, ఎంత ఖర్చులు ఉంటాయి, ఎన్ని అవమానాలు భరించాల్సి వస్తుంది, ఎంత మంది మనల్ని అభినందిస్తారు అనే విషయాలు ఇందులో చెప్తారు. వ్యయాలు, అవమానాలు ఎక్కువగా ఉంటే ఆ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం సింహ రాశి వారికి కూడా అలాగే ఉంది. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానాలు 6 అని ఉంది. దాంతో ఇది సోషల్ మీడియాలో చూసిన ఒక నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశారు.

ఆ వ్యక్తి పేరు మోహన్ రావు తెర్లి. రాశి ఫలితాలు చూసి, “శ్రీ క్రోధి నామ సంవత్సరం సింహ రాశి వారి మీద బాగా పగ బట్టేసింది. ఆదాయం 2, వ్యయం 14 అంట. అసలు ఏమన్నా అర్థం ఉందా అధ్యక్షా. ఇల్లు మారటం, మతం మారటం లాగా, ఈ ఏడు నేను కర్కాటక రాశిలోకి మారడానికి ఏమన్నా పూజలు వ్రతాలు ఉన్నాయా? చివరకు చేతబడులు, క్షుద్ర పూజలు అయినా ఓకే. కొద్దిగా చెప్పి పుణ్యం కట్టుకోండి బాబయ్యా” అంటూ రాశారు. ఈ కామెంట్ ని ఒక ఇంస్టాగ్రామ్ పేజ్ వారు ఒక మీమ్ లాగా షేర్ చేశారు. దాంతో ఇది చూసిన వాళ్లందరూ కూడా నవ్వుతున్నారు. ఈ మీమ్ మోహన్ రావు వరకు వెళ్లి, “ఏంది భయ్యా ఇలా యూస్ యూజ్ చేసేసావు?” అంటూ కామెంట్ చేశారు.

ALSO READ : “ఫిదా” సినిమాలో ఈ పొరపాటు గమనించారా..? ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు..?


End of Article

You may also like