కేంద్ర ప్రభుత్వం 69 వ చలనచిత్ర జాతీయ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి తెలుగు ఇండస్ట్రీ అత్యధిక అవార్డులను పొందిన విషయం తెలిసిందే. ఇక తమిళ సినిమా జై భీమ్ కు జాతీయ అవార్డులలో చోటు దక్కలేదు.
Video Advertisement
ఒకప్పుడు జాతీయ పురస్కారాల్లో తమిళ చిత్రాలకు మంచి ప్రాధాన్యం ఉండేది. కానీ ఈసారి కోలీవుడ్ నుండి జై భీమ్, సార్పట్ట, కర్ణన్, వంటి మంచి చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ వీటికి జాతీయ అవార్డులలో చోటు దక్కలేదు. ముఖ్యంగా సూర్య నటించిన జై భీమ్ మూవీకి ఒక్క అవార్డ్ కూడా రాకపోవడం, అందరినీ విస్మయపరిచింది. దీనిపై సినీ ప్రముఖుల దగ్గర నుండి నెటిజెన్ల వరకు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఏపీ మాజీ సీఐడీ ఛీఫ్ పీవీ సునీల్ కుమార్ ఫేస్ బుక్ లో జైభీమ్ మరియు పలాస సినిమాల గురించి పోస్ట్ చేశాడు. ముందుగా జై భీమ్ సినిమా గురించి ” ప్రశ్నించడం నేర్పే సినిమాకి అవార్డ్ ఇవ్వడం అంటే పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవడం కాదా? కాలు మీద కాలు వేసుకోవడం నేర్పే సినిమా మంచి సినిమా అవుతుందా ? అసలు వాళ్ళు కూచోవడమే నేరం అని అనుకుంటుంటే ? విశ్వనాధుడి సినిమాలు చూడండి.. శూద్రులు, దళితులు ఎలా చేతులు కట్టుకు వినయభారంతో మెలికలు తిరగాలో నేర్పిస్తాయి.
ఇలాంటి వాటికి కదా ఉత్తమ చిత్రాలనే పేరు పడింది. సిన్న తల్లులూ న్యాయం కోసం పోరాడండి అని చెప్పే ప్రమాదకర సందేశాన్ని అంగీకరిస్తారని ఎలా అనుకున్నారు ? మత్తులో ముంచే ప్రశ్న అనేదే తల ఎత్తనీయని, మనలను భయ పెట్టేవే బహు మంచి సినిమాలు మరి మన సినిమాలకు అవార్డ్ రావాలంటే?” అంటూ రాసుకొచ్చాడు. ఆ తరువాత మరో పోస్ట్ లో ” జై భీం కి అవార్డ్ ఇవ్వకూడదు అన్నది ఒక కాన్షియస్ డెసిషన్, మీరందరూ మరచిపోయినట్టున్నారు.
గత సంవత్సరం కూడా దళిత వాదం వైపు నిలబడ్డ, దళిత పౌరషం, రోషం చూపించిన పలాస సినిమాకి అవార్డ్ రాలేదు. కలర్ ఫోటో అని ఒక పెసిమిస్టిక్, చెత్త సినిమాకి అవార్డ్ ఇచ్చారు. ఈ ఉప్పెన సినిమాకి బాబు అది మూలాల్లోకి వెళితే… మన మాదిగ సోదరులు చేసి ఇచ్చే చెప్పుతో మనమే కొట్టుకోవాలి. మన సమస్యల మీద మన కళల మీద మనకి అనుకూలంగా మనం ఓట్లేసిన వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా ? వాళ్ళు కదా మాట్లాడాలి మనం మాత్రమే సోషల్ మీడియాలో ఎందుకు చించుకోవాలి ?” అంటూ రాసుకొచ్చాడు.