టాలీవుడ్ ఇండస్ట్రీ లో అమల- నాగార్జున బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. పెళ్లి తర్వాత అమల సినిమాలకు దూరం అయ్యారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు అమలకు మూగజీవులంటే ఎంతో ప్రేమ అన్న విషయం తెలిసిందే. సినిమాలనుంచి విరామం తీసుకున్న తర్వాత బ్లూ క్రాస్ ద్వారా జంతువులకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నారు అమల.

Video Advertisement

 

బ్లూ క్రాస్ తీసుకున్న బాధ్యత వల్ల సినిమాలలో ప్రస్తుతం జంతువులకు సంబంధించిన ఏవైనా సన్నివేశాలు ఉంటే ఆ సన్నివేశాలను గ్రాఫిక్స్ లో షూట్ చేస్తున్నారు. అయితే అమల చాలా సంవత్సరాల క్రితం దాఖలు చేసిన పిటిషన్ వల్ల వీధి కుక్కలను మనుషులు చంపకూడదు అనే తీర్పు వచ్చింది. దాని వల్ల కుక్కలను చంపడం తగ్గింది. అయితే కొన్ని ప్రాంతాలలో వీధికుక్కల వల్ల సామాన్య ప్రజలు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు.

netizen questions nagarjuna about street dogs..

 

తాజాగా ఒక వ్యక్తి వీధి కుక్కల వల్ల ఇబ్బందులు పడుతున్నామంటూ..జీహెచ్ఎంసి వారిని సంప్రదించగా.. అమల వేసిన పిటిషన్ వల్ల ఈ విషయం లో తాము ఏం హెల్ప్ చేయలేమని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆ వ్యక్తి ” మధ్యతరగతి వారిని మీ భార్య ఎందుకు వేధిస్తోంది. ఆ కుక్కలను మీ ఇంటి ముందు పడేస్తే మా బాధ మీకు తెలుస్తుంది” అంటూ నాగార్జునకు ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ కి పలువురు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.

netizen question to nagarjuna about amala

 

నిజానికి చాలా చోట్ల వీధి కుక్కల బెడద ఉంది. చాలా ప్రాంతాల్లో వీధి కుక్కల వల్ల పసికందులు మరణించడం, పాదచారులు తీవ్రంగా గాయపడటం వంటి వాటిని మనం చూస్తున్నాం. కానీ కుక్కలని కాపాడే క్రమం లో వాటి నుంచి మనుషులకు రక్షణ కల్పించాలి కదా… వాటిని ఏవైనా హోమ్స్ లో పెట్టి సంరక్షించాలి కదా..వాక్సిన్ వేయించి వాటిని వీధుల్లో వదిలేస్తే సరిపోతుందా అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.