మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Video Advertisement

అయితే తాజాగా వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించి.. ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది చిత్రబృందం. ఓడ రేవు సెట్ వద్దకు మీడియాను ఆహ్వానించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కొన్నిరోజుల ముందు ఇలా ప్రెస్ మీట్ పెట్టింది. అయితే మెగాస్టార్ చిరంజీవి వీరయ్య సినిమా చూసి.. వచ్చారు. ఈ సినిమాపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆనందం లోపల నుంచి తన్నుకొస్తుందని మెగాస్టార్ అన్నారు. రవితేజ మాత్రం ఈ ఫంక్షన్ లో ఏం మాట్లాడలేదు. 2 ముక్కలు కూడా మాట్లాడను.. అన్ని ముక్కలూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనే అంటూ చెప్పారు.

chiru about waltair veerayya movie..!!

అయితే ఈ చిత్రం గురించి చిరు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఒక విలేఖరి ఇది మీరు ఇంతకు ముందు చేసిన వాటిలాగా రొటీన్ మాస్ చిత్రమా అని అడగ్గా..చిరు స్పందిస్తూ.. “అవును ఇది రొటీన్ మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమానే.. అలాగే మీరు రాసుకోండి..కానీ సినిమా చూసాక మీరు షాక్ అవుతారు…” అని అన్నారు. అయితే చిరు చేసిన వ్యాఖ్యలతో ఫాన్స్ నిరుత్సాహపడ్డారు. చిరంజీవే సినిమా గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే జనాలు కూడా సినిమా చూడరు కదా.. ఎందుకు బాసూ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నావ్ అని ఫీల్ అవుతున్నారు మెగా ఫాన్స్.

 

chiru about waltair veerayya movie..!!
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజతో కలిసి మాస్ జాతర చేయడానికి సిద్దమవుతున్నాడు. చిరు వింటేజ్ లుక్ లో దర్శనమిస్తూ వస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ మూవీలో రవితేజ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఇప్పటికి ఈ మూవీ నుంచి ‘బాస్ పార్టీ’, ‘చిరంజీవి-శ్రీదేవి’, ‘వీరయ్య’ సాంగ్స్ రిలీజ్ కాగా.. చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి.