దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన కళాఖండం ఆర్ ఆర్ ఆర్. కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతి ఎల్లలు దాటింది. కానీ భారత్ తరఫున ఆస్కార్ అవార్డుల పోటికి అధికారిక ఎంట్రీకి గుజరాతీ చిత్రం ఛెల్లో షో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.

Video Advertisement

అయితే దానితో సంబంధం లేకుండా ఎఫ్ వై సి(ఫర్ యువర్ కన్సిడరేషన్) క్యాంపెయిన్ మొదలు పెట్టింది ఆర్ ఆర్ ఆర్ టీం. అయితే ఈ చిత్రం ఆస్కార్స్ లో నిలుస్తుంది అన్నప్పటి నుంచి ఆస్కార్ కి వెళ్లబోయే లిస్ట్ అంటూ చాలా వార్తలు వచ్చాయి. కానీ వాటిలో ఏవి ఇప్పటి వరకు అధికారికం గా ప్రకటించలేదు.

rrr for oscars new list goes viral..

అలాగే తాజాగా మరో లిస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఈ పరిశీనలకు సంబంధించి ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు (రాజమౌళి), ఉత్తమ నటుడు (రామ్ చరణ్), ఉత్తమ పాట (నాటు నాటు, కీరవాణి), ఉత్తమ చిత్రం (ఆర్ ఆర్ ఆర్), ఉత్తమ స్క్రీన్ ప్లే ( విజయేంద్ర ప్రసాద్), ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ ( శ్రీనివాస్ మోహన్) అని ఆ లిస్ట్ లో ఉంది. వీటిలో కనీసం రెండు కేటగిరీల్లో ఆస్కార్స్ వచ్చే అవకాశం ఉంది అనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది.

rrr for oscars new list goes viral..

అయితే ఈ సినిమాలో బెస్ట్ యాక్టర్ గా జూనియర్ ఎన్టీఆర్ ని ఎంతో పెద్ద అవార్డ్ అయిన ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్ కి పంపాలి అంటూ ఒక ప్రముఖ మ్యాగజిన్ రాసింది. కానీ ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ పేరు లేకపోవడం పై ఆయన ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రం లో కొమురం భీం గా ఎన్టీఆర్ ఎంతో బాగా నటించారు. ఆయన పాత్ర పై సర్వత్రా పలు ప్రసంశలు లభించాయి.

rrr for oscars new list goes viral..

అధికారికంగా ఆస్కార్ బరిలో నిలిచే చిత్రాలు, నటులు, వంటి వివిధ కేటగిరీ లకు సంబంధించిన లిస్ట్ వచ్చే ఏడాది జనవరి 24 న రానుంది. అప్పటికి ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఆస్కార్ వేడుక వచ్చే ఏడాది మార్చి నెలలో జరుగనుంది.