సినీ పరిశ్రమ ఎప్పటికప్పుడు టాలెంట్ ఉన్నవారిని అందలం ఎక్కిస్తూనే ఉంటుంది. కెరీర్ మొదట్లో ఎన్నో ప్లాప్స్ వచ్చిన వాళ్ళను కూడా స్టార్ నటులను చేస్తుంది. కానీ ప్రస్తుతం కొందరు హీరోయిన్లు తమకు బ్రేక్ ఇచ్చిన వాళ్ళని అవమానిస్తున్నట్లు మాట్లాడటం కామన్ అయిపోయింది. ఇటీవల రష్మిక తన ప్రవర్తనతో చాలా వివాదాల్లో పడి బ్యాన్ ఆలోచన వచ్చేవరకు తెచ్చుకుంది.

Video Advertisement

 

అయితే తాజాగా రష్మిక మరోసారి నోరు జారి వివాదం లో చిక్కుకున్నారు. సౌత్ చిత్రాలతో స్టార్ గా మారిన రష్మిక ప్రస్తుతం పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. ఆమె లేటెస్ట్ బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను ప్రమోషనల్ ఈవెంట్లో బాలీవుడ్ తో సౌత్ ఇండస్ట్రీని పోల్చుతూ తక్కువ చేసి మాట్లాడింది రష్మిక. కన్నడ భాషపై, కాంతార చిత్రంపై ఆమె స్టేట్మెంట్స్ వివాదాస్పదం అయిన విషయం మరచిపోకముందే.. దక్షిణాది చిత్రాల్లోని పాటలను అవమానిస్తూ కామెంట్స్ చేసింది రష్మిక.

rashmika about south songs..

 

మిషన్ మజ్ను లోని ఒక రొమాంటిక్ సాంగ్ తన కెరీర్ లోనే బెస్ట్ సాంగ్ అని చెప్పిన రష్మిక ” నాకు రొమాంటిక్ సాంగ్స్ అంటే బాలీవుడ్ గుర్తొస్తుంది. చిన్నప్పటి నుంచి ఇక్కడి పాటలే వింటూ పెరిగాను. సౌత్ చిత్రాల్లో ఈ తరహా రొమాంటిక్ సాంగ్స్ ఉండవు. అక్కడంతా మాస్ మసాలా ఐటెం సాంగ్స్ మాత్రమే ఉంటాయి. ” అని నోరుజారారు. దీంతో రష్మిక పై నెటిజన్లు మండిపడుతున్నారు.

rashmika about south songs..

దీంతో రష్మిక కామెంట్స్ పెద్ద దుమారం లేపుతున్నాయి. ఆమెకు బాలీవుడ్ మ్యూజిక్ ఇష్టం అయితే… వారిని పొగడటంలో ఎలాంటి తప్పు లేదు. ఆ పేరుతో సౌత్ మ్యూజిక్ ని దిగజార్చి మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇళయరాజా స్వరపరిచిన రొమాంటిక్ సాంగ్స్ రష్మిక బహుశా వినలేదేమో. అంతకు మించిన గొప్ప మెలోడీలు, రొమాంటిక్ సాంగ్స్ ఇచ్చిన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరో ఆమె చెప్పాలి అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రష్మిక క్షమాపణలు చెప్పి తన కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.