ఆచార్య ఫ్లాప్ అయిన త‌ర‌వాత ఆ సినిమా గురించి పెద్దగా స్పందించ‌లేదు చిరు. ఓ కార్య‌క్ర‌మంలో మాత్రం ద‌ర్శ‌కుల‌పై సెటైర్లు వేశాడు. సెట్లోనే సీన్లు రాస్తున్నార‌ని, దాని వ‌ల్ల ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని ప‌రోక్షంగా కొర‌టాల శివ‌పై బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఇప్పుడు మాత్రం డైరెక్ట‌ర్‌గానే ఆచార్య ఫ్లాప్‌ని కొర‌టాల‌పై తోసేశాడు.

Video Advertisement

గాడ్ ఫాద‌ర్ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా బాలీవుడ్ మీడియాకు ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు చిరు. ఈ సంద‌ర్భంగా ఆచార్య ఫ్లాప్ ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. `ఆ సినిమా ఫ్లాప్ విష‌యంలో బాధ ప‌డ‌డం లేదు. నేను ద‌ర్శ‌కుడు చెప్పిన‌ట్టే చేశా` అంటూ ఈ ఫ్లాప్‌కి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌.. కొర‌టాల‌నే అన్న‌ట్టు మాట్లాడాడు చిరు.

chiru comments on aacharya movie flop

మెగాస్టార్ చిరంజీవి.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ డిజాస్టర్‏గా నిలిచింది. చాలా కాలం తర్వాత ఫుల్ లెంత్‏లో చరణ్, చిరు కలిసి నటించిన ఈ మూవీ కోసం థియేటర్లకు వెళ్లిన మెగాభిమానులు నిరాశకు గుర్యయారు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే బాలేదంటూ ఈ మూవీపై నెట్టింట నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.

chiru comments on aacharya movie flop
అయితే ఈ సినిమా ఫెయిల్యూర్ పై మొదటి సారి మెగాస్టార్ స్పందించారు. ప్రస్తుతం గాడ్ ఫాదర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న చిరు.. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆచార్య ప్లాప్ పై ప్రశ్నించగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చేశారు.

chiru comments on aacharya movie flop
ఈ సినిమా అపజయం తనను ఏమాత్రం బాధించలేదని అన్నారు. తన కెరీర్ ప్రారంభంలో సినిమా విజయం సాధిస్తే ఎంతో సంతోషించేవాడినని.. అలాగే పరాజయం వస్తే బాధపడేవాడినని తెలిపారు. కానీ ఆరోజులు ఇప్పుడు గడిచిపోయాయని.. మొదటి 15 సంవత్సరాల్లోనే అనేక అనుభవాలను ఎదుర్కోన్నానని.. ఆ సమయంలోనే మానసికంగా, శారీరకంగా అన్నింటినీ తట్టుకోవడం తెలుసుకున్నానని చెప్పారు. ఇక నటుడిగా ఎదిగిన తర్వాత సినిమాలు డిజాస్టర్స్ కావడం వలన తాను బాధపడలేదని.. అలాగే విజయాన్ని ఏమాత్రం తలకెక్కించుకోలేదంటూ చెప్పుకొచ్చారు.

chiru comments on aacharya movie flop

“ఆచార్య పరాజయం అనేది నన్ను బాధించలేదు. ఎందుకంటే మేము డైరెక్టర్ చెప్పినట్లు చేశాము. కానీ ఒక బాధ మాత్రం ఉంది. నేను, చరణ్ మొదటిసారి కలిసి సినిమా చేశాం. అది హిట్ కాలేదు. ఒకవేళ భవిష్యత్తులో చేసినా.. ఇంత జోష్ ఉండకపోవచ్చు. అంతకు మించి ఎలాంటి బాధలేదు.” అన్నారు మెగాస్టార్.

chiru comments on aacharya movie flop
అయితే ‘ఆచార్య‌’ ఫ్లాప్‌పై చిరంజీవి స్పందించిన తీరుని నెటిజ‌న్స్ వ్య‌తిరేకిస్తున్నారు. ఇద్ద‌రు స్టార్ హీరోల‌ను కాద‌ని.. కొర‌టాల శివ సినిమా డైరెక్ట్ చేస్తారా..ఫ్లాప్ వ‌స్తే దానికి అత‌న్నే పూర్తి బాధ్యుడ్ని చేయ‌టం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది హీరోలు సినిమా ప్లాప్ అయితే తామే బాధ్యత తీసుకోవడం చూస్తున్నాం.. కానీ చిరు వంటి పెద్ద హీరో ఇటువంటి కామెంట్లు చెయ్యడం ఎం బాలేదంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

chiru comments on aacharya movie flop
ప్రస్తుతం ఆయన గాడ్ ఫాదర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళం సూపర్ హిట్ లూసీఫర్ రీమేక్ గా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.