టాలీవుడ్ ఇండస్ట్రీలో తమిళ హీరో విజయ్ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి అని రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అతని గత సినిమాలు తెలుగు మార్కెట్లో మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. ఇక తప్పకుండా ఈసారి వారసుడు సినిమాతో అంతకుమించి అనేలా విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. తమిళ ఇండస్ట్రీలో అత్యధిక మార్కెట్ తో కొనసాగుతున్న విజయ్ ఇప్పుడు వారసుడు సినిమాతో కూడా ఊహించని స్థాయిలో బిజినెస్ క్రియేట్ చేశాడు.

Video Advertisement

 

మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసమే అతను 90 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నాడు. విజయ్ కెరీర్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక పారితోషికం కావడం విశేషం. అలాగే విజయ్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది.

netizens fire on thalapthy vijay..!!

వారసుడు సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంటుంది అని దిల్ రాజు భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టారు. అయితే భారీ పెట్టుబడి పెట్టడం వలన ఇప్పుడు ప్రమోషన్స్ కూడా ఈ సినిమాకు చాలా ముఖ్యం కానుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో వారసుడు సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలు మెల్ల మెల్ల గా సాగుతున్నాయి. కానీ తమిళనాడులో చేస్తున్నట్లు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ చెయ్యట్లేదు. ఇప్పటి వరకు తెలుగులో రిలీజ్ అయిన ఏ సినిమా ప్రమోషన్స్ కి విజయ్ రాలేదు.

 

netizens fire on thalapthy vijay..!!
దీంతో చాలా మంది నెటిజన్లు ఈ విషయం పై విజయ్ ని ట్రోల్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమా ని అన్ని రాష్ట్రాల్లో ప్రమోట్ చేసారు. కానీ విజయ్ తెలుగు దర్శకుడు, తెలుగు నిర్మాత తో కలిసి చేస్తున్న ఈ సినిమాకి కూడా విజయ్ వచ్చి ప్రమోషన్స్ చెయ్యట్లేదు అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇటువంటి హీరో సినిమా అసలు మనం ఎందుకు చూడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.