చాలా మంది వాస్తు చిట్కాలను అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకోవడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే పాజిటివ్ ఎనర్జీని తీసుకు రావడానికి కూడా వాస్తు సహాయం చేస్తుంది. అయితే కొన్ని కొన్ని సార్లు మనం ఇతరుల వస్తువుల్ని తీసుకుంటూ ఉంటాం.
మనకి ఒక్కొక్కసారి ఏదైనా వస్తువులు అవసరం అయ్యి మన దగ్గర అవి లేకపోతే.. అటువంటపుడు ఇతరులను అడిగి వాటిని వాడుతూ ఉంటాం.
ఎంతటి అవసరం అయినా సరే ఈ వస్తువులను అస్సలు తీసుకోకూడదని వాస్తు శాస్త్రం అంటోంది. వీటిని తీసుకోవడం వల్ల ప్రతికూల శక్తి మనలో ఏర్పడుతుంది. అలానే మీకు ఎంతో నష్టాన్ని అది తీసుకువస్తుంది. అయితే మరి ఏ వస్తువులు ఇతర నుంచి తీసుకోకూడదు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
#1. పెన్:
ఎప్పుడు కూడా ఇతరుల పెన్ ని తీసుకోకూడదు. ఇతరుల పెన్ ని తీసుకొని ఉపయోగించడం మంచిది కాదు. దీని వల్ల మీరు డబ్బులు కూడా కోల్పోతారు. అలానే చెడుని ఇది తీసుకొస్తుంది.
#2. వాచ్:
ఒక్కొక్క సారి అవసరమైనప్పుడు ఇతరులు వాచ్ ని కూడా మనం అడిగి ధరిస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల మనిషికి చెడు కాలం మొదలవుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఎంత అవసరమైనా ఇతరుల వాచీని అడగద్దు.
#3. రుమాలు:
ఇతరులు రుమాలుని తీసుకుని ఉపయోగించడం వల్ల గొడవలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎవరి రుమాలు కూడా మన దగ్గర ఎప్పుడూ ఉంచుకోకూడదు. దీని వల్ల కూడా మనం ఎంతో నష్టపోతాము.
#4. బట్టలు:
ఇతరుల బట్టలు కూడా అడిగి వేసుకోకూడదు. దీని వల్ల కూడా నెగటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే జీవితంలో కష్టాలను ఇది తీసుకు వస్తుంది. కనుక వీటిని ఎప్పుడూ ఇతరుల నుంచి తీసుకోవద్దు.