యవ్వనం లో ఈ 4 తప్పులు చేస్తే జీవితాంతం ఇబ్బంది పడాల్సిందే…!

యవ్వనం లో ఈ 4 తప్పులు చేస్తే జీవితాంతం ఇబ్బంది పడాల్సిందే…!

by Megha Varna

Ads

మనం మంచి భవిష్యత్తుని పొందాలన్నా, జీవితంలో మనం అనుకున్నది సాధించాలన్నా ప్రస్తుతం ఉండే దశ చాలా ముఖ్యమైనది. కానీ చాలా మంది ఆ విషయం తెలియక రేపు కదా చూసుకుందాంలే అన్నట్లు ధీమాతో ఉంటారు. కానీ నిజానికి భవిష్యత్తు బాగుండాలంటే ప్రస్తుతం నడుస్తున్న కాలాన్ని కూడా వినియోగించుకోవాలి. మిమ్మల్ని మీరు ఉన్నతంగా మలుచుకోవాలి.

Video Advertisement

ముఖ్యంగా యవ్వనంలో ఉన్నప్పుడు ఈ పనులు చేయాలి. ఎందుకంటే అప్పుడే బలం, ధైర్యం, ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. దానిని సద్వినియోగం చేసుకుంటే జీవితం బాగుంటుంది అని చాణక్య నీతి చెబుతోంది. అయితే మరి ఆచార్య చాణక్య చెప్పిన అద్భుతమైన విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. యవ్వనంలో ఉన్నప్పుడే సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని ఆచార్య చాణక్య అంటున్నారు. అయితే ఈ తప్పులు కనుక అవ్వడం లో చేస్తే జీవితాంతం కూడా ఇబ్బందులే ఉంటాయని అంటున్నారు.

#1. బద్ధకం వుండకూడదు:

మనుషుల్లో శక్తియుక్తులు ఉంటాయి. కానీ బద్ధకం ఉంటే ఎంతో ముఖ్యమైన సమయాన్ని మనం కోల్పోతాము. పైగా మన సామర్థ్యం కూడా దుర్వినియోగం అవుతుంది. మనిషి యొక్క గెలుపుని ఆపడానికి బద్ధకం ఒకటి చాలు. కాబట్టి ఎప్పుడూ కూడా బద్ధకంతో ఉంటూ తప్పు చేయొద్దు.

#2. అజాగ్రత్తగా ఉండొద్దు:

అజాగ్రత్తగా ఉంటే జీవితాంతం కూడా దానిని మనం భరించాల్సి వస్తుంది. మనం సాధించడానికి అడ్డంకిగా మారుతుంది. కాబట్టి ఎప్పుడూ నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా ఉండద్దు.

#3. వ్యసనం:

చాలా మంది యవ్వనంలో చెడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. యుక్త వయసులో ఉన్నప్పుడు ఏమైనా అలవాట్లకు బానిస అయితే జీవితాంతం నష్టపోతూనే ఉంటారు.

#4. స్నేహితులు:

చెడు స్నేహాల వల్ల జీవితం పక్కదారి పడుతుంది. అందుకని యవ్వనంలో ఉన్నప్పుడు మీరు ఎంచుకునే స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. మంచి మార్గంలో వెళ్లే వాళ్ళతో మాత్రమే స్నేహం చేయాలి. ఒకవేళ కనుక ఈ నాలుగు తప్పులు మీరు యవ్వనంలో ఉన్నప్పుడు చేశారంటే జీవితాంతం ఇబ్బంది పడాల్సిందే.


End of Article

You may also like