చాణక్యుడు ఎంతటి మహా జ్ఞానో అందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు.

Video Advertisement

చాణక్య నీతి ప్రతి అంశాన్ని కూడా ఎంతో అద్భుతంగా వివరించింది. చాణక్యుడు స్నేహితుల గురించి కూడా ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు.

అలానే చాణక్య భార్య భర్తల మధ్య అంతా బాగుండాలంటే ఎలాంటివి అనుసరించాలి అనేవి కూడా చెప్పారు. అలానే మగవాళ్ళు ఈ నాలుగు విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదట. భార్య కి కూడా వీటిని అస్సలు చెప్పకూడదు ఆని ఆచార్య చాణక్య చాణక్య నీతి ద్వారా తెలిపారు.

#1. మగవారి జీవితం లో వచ్చే ఆర్థిక ఇబ్బందుల గురించి అస్సలు ఎవరికీ చెప్పకూడదు. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఎదురైనప్పటికీ వాటిని ఇతరులతో పంచుకోవద్దు. ఆర్థిక పరిస్థితి గురించి, ఆర్థిక ఇబ్బందులు గురించి భార్య కి కూడా మగవాళ్ళు చెప్పుకోకూడదు. అలానే డబ్బులు పోయినా సరే మగవాళ్ళు భార్యకి చెప్పకూడదు. నిజానికి ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారని ఎవరికైనా చెప్తే ఎవరు సహాయం కూడా చేయరు.


#2. మగవాళ్ళు భార్య గురించి ఎప్పుడూ ఇతరులకు చెప్పుకోకూడదు. భార్య కి సంబంధించిన రహస్యాలను షేర్ చేసుకోకూడదు.
#3. అలానే మగవాళ్ళు వ్యక్తిగత సమస్యలను కూడా ఇతరులతో చెప్పకూడదు. ఎందుకంటే వ్యక్తిగత సమస్యలు ఎవరికైనా చెప్తే వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుతారు. దాంతో తిరిగి బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఎవరితోనూ షేర్ చేసుకోకుండా ఉండడమే మంచిది.


#4. ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో అవమానానికి గురి అయితే దానిని కూడా ఎవరికీ చెప్పకూడదు. భార్యతో కూడా ఆ విషయాన్ని చెప్పకూడదు. ఒకవేళ చెప్పారంటే మానసికంగా క్రుంగిపోవాల్సి వస్తుంది.