Ads
ఇటీవల సాయిధరమ్ తేజ్ కు ఆక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం, మరియు ఆక్సిడెంట్ అయిన తరువాత ఏమి జరిగింది అన్న విషయాలపై గత కొద్దీ రోజులు గా ఎటువంటి అప్ డేట్స్ రావడం లేదు. సెప్టెంబర్ 10 వ తేదీన ఆయనకు ఆక్సిడెంట్ జరిగింది. అప్పటినుంచి ఆయన ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు, ఆయన డిశ్చార్జ్ అయిపోతున్నారు అంటూ అక్కడక్కడా వార్తలు కనిపించినా.. ఆయన ఇంకా డిశ్చార్జ్ అవ్వలేదని తెలుస్తోంది.
Video Advertisement
మరో వైపు, ఆయనను కలిసిన వారంతా సాయి బాగానే ఉన్నారు అంటూ చెప్తున్నారు. కానీ, రిపబ్లిక్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అందరిని కన్ఫ్యుజెన్ లో పడేశాయి. సాయి ధరమ్ తేజ్ ఇంకా కోమా లోనే ఉన్నారని పవన్ చెప్పడం తో ఫ్యాన్స్ అయోమయం లో పడ్డారు. మొదట్లో సాయి ధరమ్ తేజ్ గురించి ఎక్కువ గా వార్తలు వచ్చాయి. దీనితో… అందరు విమర్శలు చేసారు.
ఈ క్రమం లో సాయి ధరమ్ తేజ్ గురించి హెల్త్ బులెటిన్ విడుదల చేసిన హాస్పిటల్ యాజమాన్యం కూడా తాజాగా విడుదల చేయడం లేదు. గత రెండు రోజులుగా ఇతర సెన్సేషనల్ అంశాలు కూడా చోటు చేసుకోవడం తో సాయిధరమ్ తేజ్ కు సంబంధించిన వివరాలు మాత్రం బయటకు రాలేదు. మొన్న జరిగిన రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో పవన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం అభిమానుల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
ఈ క్రమం లో దర్శకుడు దేవా కట్టా చేసిన వ్యాఖ్యలు మరింత కన్ఫ్యుజెన్ లో పడేశాయి. సాయి ధరమ్ తేజ్ బాగానే ఉన్నారని, రిపబ్లిక్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లైవ్ చూసారని, సినిమా ఒకటవ తారీకు రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. మరి ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కోమా లోనే ఉన్నారని ఎందుకు చెప్పారు? ఎవరి మాట నిజం? అనేది ఫ్యాన్స్ కి అర్ధం కావడం లేదు. ఒకవేళ ఆయన కోమాలోనే ఉంటె లైవ్ ఎలా చూసారు? అన్న సందేహాలు ప్రస్తుతం అభిమానుల్లో చర్చకు తెరలేపాయి. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఎలా ఉన్నారు? అన్న విషయం తెలియాల్సి ఉంది.
End of Article