రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘ఆది పురుష్’. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం లో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటిస్తున్నారు. ఓమ్ రౌత్ దర్శకుడిగా రానున్న ఈ చిత్రం పై దేశవ్యాప్తం గా భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ చిత్ర టీజర్ రిలీజ్ చెయ్యగా భారీగా ట్రోల్స్ వచ్చిన విషయం తెలిసిందే. రామాయణం మొత్తాన్ని మార్చి తీసారని దర్శకుడి పై విమర్శలు రావడం తో ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో నుంచి తప్పిస్తూ జూన్ కి వాయిదా వేశారు.

Video Advertisement

అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత ఆలస్యం కానున్నాయని తెలుస్తోండటంతో ఈ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడనుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు అనుకున్న దానికంటే కూడా ఆలస్యంగా జరుగుతున్నాయట. ప్రేక్షకులకు మరింత మంచి అనుభూతిని అందించేందుకు ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటుందట ఆదిపురుష్ టీమ్.

prabhas aadipurush movie is getting delayed again..

భారీ అంచనాల మధ్య విడుదలైన టీజర్‌ నెగిటివ్ రివ్యూస్‌ను సొంతం చేసుకుంది. అందరిని డిస్సాప్పాయింట్ చేసింది. టీజర్ చూసిన తర్వాత ఆదిపురుష్‌పై అంచనాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా టీజర్ లో గ్రాఫిక్స్ చాలా వరస్ట్‌గా ఉన్నాయని అంటున్నారు నెటిజన్స్. దీంతో ఈ చిత్ర గ్రాఫిక్స్ పై విమర్శలు వచ్చిన నేపథ్యం పలు కీలక మార్పులు చేస్తున్నట్లు సమాచారం. మరో 200 కోట్లు ఖర్చు పెట్టి ఈ చిత్రం లోని పలు పాత్రల పై రీ షూట్ చేసారని తెలుస్తోంది. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు గ్రాఫిక్స్ మార్పులు చేసినా కూడా అంత బాగా రాలేదని తెలుస్తోంది.

prabhas aadipurush movie is getting delayed again..

రామాయణంలో ముఖ్యంగా చెప్పుకునే లంకేశుడి పాత్రను బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌, లక్ష్మణుడి పాత్రను సన్నీసింగ్‌ పోషించారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి భూషణ్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. పాన్‌ఇండియా మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది.