Ads
ఈ అమ్మాయి జీవితంలో పెళ్లి అనేది ఎంతో మధురమైన ఘట్టం. పెళ్లి అయిన తర్వాత ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెడుతుంది కొత్త పెళ్లి కూతురు. తమ అత్తమామలు, భర్త , కుటుంబ సభ్యులలో మంచి పేరు సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడుతుంది.
Video Advertisement
అయితే తాజాగా కొన్ని అధ్యయనాల ద్వారా అమ్మాయిలు పెళ్లయిన కొత్తలో ఎక్కువగా గూగుల్ మీద ఆధారపడుతూ ఉంటున్నారట. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు గూగుల్ వాడకం ఎక్కువైపోయింది. ఏ విషయంపై వివరాలు కావాలన్నా గూగుల్ సర్చ్ చేస్తున్నారు. ఈ అధ్యయనంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.మరి మన కొత్తగా పెళ్లైన పెళ్లి కూతుర్లు ఏ విషయంపై ఎక్కువ గూగుల్లో సెర్చ్ వెతుకుతున్నారంటే…
#1. ఆకర్షణ :
పెళ్లయిన ప్రతి అమ్మాయి తన భర్త కు ఎంతో ఆకర్షణీయంగా కనిపించాలని అనుకుంటుంది. భర్తకి ఏ విధంగా ఆకర్షణీయంగా కనిపించాలని విషయమై ఒక పెళ్లైన అమ్మాయిలు సెర్చ్ ఇస్తున్నారని తెలిసింది.
#2. భర్త ఇష్టాలు అయిష్టాలు :
కొత్తగా పెళ్లయిన ప్రతి మహిళ తమ భర్త ఏ విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారని గూగుల్ సెర్చ్ లో వెతుకుతున్నారు. అదేవిధంగా భర్తలకు ఏది ఇష్టం, ఏది అయిష్టం అనే విషయాలు తెలుసుకోవడం కోసం సెర్చ్ తున్నారు.
#3. మనసు గెలుచుకోవడం :
భర్తతో ఏ విధంగా మెలగాలి, అతని మనసుని ఎలా మెప్పించాలి అని తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపి గూగుల్ సెర్చ్ చేస్తున్నారు.
#4. కుటుంబ సభ్యులు మెప్పు పొందడం :
పెళ్లయిన కొత్తలో ఇంట్లో వారితో ఎలా ప్రవర్తించాలి. అత్తగారి మనసు ఎలా నెగ్గాలి. కుటుంబ సభ్యులు అందరికి నచ్చేవిధంగా వంటకాలు ఏ విధంగా చేయాలి అనే విషయాలపై ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు తెలిసింది.
#5. బాధ్యత:
తమ కుటుంబ బాధ్యతను ఎలా చూసుకోవాలి. కుటుంబానికి అండగా నిలవడానికి సొంతంగా ఎలా సంపాదించాలి అనే విషయాలపై ఎక్కువగా గూగుల్లో సెర్చ్ చేస్తున్నట్లు అధ్యయనాలలో వెల్లడైంది.
End of Article