కొత్తగా పెళ్లి చేసుకొని ఇంట్లోకి వస్తున్న కోడలు బియ్యం ఉన్న కలశాన్ని తన్నడం వెనుక ఉన్నఅసలు ట్విస్ట్ ఇదేనా..??

కొత్తగా పెళ్లి చేసుకొని ఇంట్లోకి వస్తున్న కోడలు బియ్యం ఉన్న కలశాన్ని తన్నడం వెనుక ఉన్నఅసలు ట్విస్ట్ ఇదేనా..??

by Sunku Sravan

Ads

మన భారతదేశంలో వివాహం అంటేనే అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. పూర్వ కాలంలో అయితే పెళ్లిళ్లను ఐదు రోజుల వరకు చేసేవారు. కానీ కాలక్రమేణా సమయం దృష్ట్యా ప్రస్తుతం అలా తక్కువ మంది చేసుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో వివాహం విషయంలో కాంప్రమైజ్ అనేది లేకుండా అంగరంగ వైభవంగా సాంప్రదాయాలను పాటిస్తూ ఈ తంతు నడిపిస్తున్నారు.

Video Advertisement

అయితే ఇందులో అనేక పూర్వ సంప్రదాయాలున్నాయి. ఆ సంప్రదాయాల వెనుక అసలు విషయం ఏంటో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ఇందులో ఒకటి కొత్తగా పెళ్లి చేసుకొని అత్తగారి ఇంట్లోకి అడుగుపెట్టే కొత్త కోడలు బియ్యంతో నిండిన కలశాన్ని తన్నుకుంటూ ఇంట్లో అడుగు పెడుతుంది. అలాగే కొంతమంది ఎర్రని నీటిలో రెండు చేతులను ఉంచి గోడకు అద్దడం చేస్తూ ఉంటారు. మరి ఇలా ఎందుకు చేస్తారు దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఓసారి చూద్దాం..!!

#1బియ్యంతో నింపిన కలశాన్ని తాకడం
కొత్తగా పెళ్లయి అత్త వారి ఇంట్లోకి అమ్మాయి రావటాన్ని మెట్టినింట్లో కాలు మోపడం అంటారు. ఈ సందర్భంలో బియ్యంతో నింపిన కలశాన్ని కుడికాలితో ఇంట్లోకి తోసి మొదటిసారి ఇంట్లోకి ప్రవేశించడాన్ని లక్ష్మీ దేవిగా భావించి, ఆమె రాకతో సిరిసంపదలు ఇంట్లోకి ఆహ్వానించడం. బియ్యాన్ని సిరిసంపదల గుర్తుగా మొదటిసారి కాలు పెట్టేటప్పుడు ఆ చెంబును కాలితో తోసుకుంటూ ఇంట్లోకి అడుగు పెడతారు.

#2ఎర్రని నీటిలో పాదాలు పెట్టడం
మరొక పద్ధతి కొన్ని ప్రాంతాల్లో మొదటిసారి మెట్టినింటా అడుగుపెట్టేటప్పుడు ఎర్రని నీటిలో పాదాలు ముంచి గుర్తులు పడేలా ఇంట్లోకి అడుగు పెడుతూ నడిపించడం చేస్తూ ఉంటారు. ఈ పద్ధతిని కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని భావిస్తారు.

 

#3 అప్పగింతల సమయంలో
అలాగే ఆడపిల్లకు పెళ్ళిచేసి అప్పగింతల సమయంలో తనతో పాటు పుట్టింటీ సంపద దూరం కాకుండా ఇన్నేళ్లు తనని పోషించినందుకు కృతజ్ఞతగా దోసిలితో బియ్యాన్ని వెనక్కి చలిస్తారు.

#4 ఓడి బియ్యం
అలాగే ఒడిబియ్యం సంప్రదాయం ఉన్నవారు తల్లిగారి ఇంట్లో ఒడిలోని బియ్యంలో నుంచి పిడికిలితో తీసి కొన్ని బియ్యం గుప్పిట్లో నుంచి పళ్లెంలో కుప్పలు పోసి దండం పెడతారు. వీటిని వారి తల్లి గారు నైవేద్యంగా వండుకుంటారు.

#5గుమ్మానికి బొట్టు పెట్టడం
అలాగే కొంతమంది కొత్త కోడలితో మన ఇంటి మెయిన్ గుమ్మానికి ఎవరికీ అందనంత ఎత్తులో బొట్లు పెట్టిస్తారు. దీని ద్వారా కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని భావిస్తారు.


End of Article

You may also like