ప్రముఖ నటి చనిపోయారు అంటూ ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆ నటి కన్నడ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. మిగిలిన భాషల్లో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అంతే కాకుండా రాజకీయాల్లో కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళితే, నటి దివ్య స్పందన చాలా సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నారు.

Video Advertisement

రమ్య అనే పేరుతో ఇండస్ట్రీలోకి పరిచయం అయిన దివ్య స్పందన ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్నారు. సూర్య హీరోగా నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పాపులర్ అయ్యారు.

news about heroine divya spandana

ఇంకా చాలా సినిమాల్లో దివ్య స్పందన నటించారు. అయితే హఠాత్తుగా దివ్య స్పందన గురించి ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. దివ్య స్పందన చనిపోయారు అనే వార్త పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అంతేకాకుండా దివ్య స్పందన కూడా ఈ విషయంపై స్పందించి సోషల్ మీడియాలో ఈ పేరు మీద చాలా చర్చ జరుగుతుంది అని అర్థం వచ్చేలాగా ఒక పోస్ట్ చేశారు.

news about heroine divya spandana

2003 లో అభి అనే సినిమాతో కన్నడ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు దివ్య స్పందన. ఆ తర్వాత 2004 లో కుత్తు అనే తమిళ్ సినిమాలో కూడా నటించారు. 2013 లో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. అయితే 2014 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అదే నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం సినిమాలు చేస్తూ, రాజకీయాల్లో కూడా ఉన్నారు.

ALSO READ : “మమ్మల్ని కూడా కొంచెం కాపాడండి..!” అంటూ… “విజయ్ దేవరకొండ” పాత సినిమా నిర్మాతల పోస్ట్..! ఏం అన్నారంటే..?