వాలెంటైన్స్ డే సందర్భం గా తమిళ, తెలుగు అభిమానులు కలిసి ఆమెకు ఊహించని గిఫ్ట్ ను ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళనాట ఆమెకు ఏకం గా గుడిని కట్టేసారు. గతం లో ఎంజీఆర్, జయలలిత, నమిత, హన్సిక, ఖుష్భు, వంటి స్టార్ లకు వారు గుడి కట్టారు. తాజాగా, నిధి అగర్వాల్ కి కూడా వారు గుడి కట్టేయడం తో ఆమె ఆనందం తో ఉబ్బితబ్బిబ్బైపోతోంది. ఇంత ప్రేమను ఉహించలేదంటూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.ఈ సందర్భం గా ఆమె తన ఫాన్స్ ని ఓ మూడు కోరికలను కోరింది. తనకు గుడి కట్టించేంతగా అభిమానించే ఫ్యాన్స్ ఉన్నందుకు ఓ వైపు సంతోషం గా ఉన్నానని చెబుతూనే.. ఆ గుడి ని నిరాశ్రయులకు ఆశ్రయం గా ఇవ్వాలని కోరుతున్నట్లు ఆమె తన అభిమానులకు తెలిపారు. అంతే కాదు… విద్యను అందించడం, ఆకలి ఉన్నవారికి ఆకలి తీర్చడం వంటి సేవా కార్యక్రమాలకు ఈ గుడి వేదిక అవ్వాలని తాను కోరుకుంటున్నట్లు నిధి చెప్పుకొచ్చింది.

అందాల భామ నిధి అగర్వాల్ కు తెలుగు నాటే కాదు..తమిళనాట కూడా చాలా మంది అభిమానులే ఉన్నారు. సవ్యసాచి తో తెలుగు వారికి దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత అఖిల్ “మజ్ను” సినిమా లో నటించారు. గతేడాది రామ్ “ఇస్మార్ట్ శంకర్ ” సినిమా తో నిధి అగర్వాల్ స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు. తమిళనాట కూడా ఈ ఏడాది సంక్రాంతి కి నిధి అగర్వాల్ సినిమాలు రెండు విడుదల అయ్యాయి. “భూమి” సినిమా ఓటిటి రిలీజ్ అవ్వగా, “ఈశ్వరన్” సినిమా థియేటర్ లో విడుదల అయింది.