• చిత్రం : 18 పేజెస్
 • నటీనటులు : నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ , బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి
 • నిర్మాత : బన్నీ వాస్
 • కథ, స్క్రీన్ ప్లే : సుకుమార్
 • దర్శకత్వం : పల్నాటి సూర్య ప్రతాప్
 • సంగీతం : గోపి సుందర్
 • విడుదల తేదీ : డిసెంబర్ 23 , 2022

18 pages telugu-movie-story-review-rating

Video Advertisement

స్టోరీ:

ఫోన్, సోషల్ మీడియా ఉపయోగించకుండా ప్రస్తుత ప్రపంచానికి దూరంగా జీవించే నందిని (అనుపమ పరమేశ్వరన్) చుట్టూ కథ తిరుగుతుంది అయితే ఇది సిద్ధార్థ్ (నిఖిల్) ఆమెతో ప్రేమలో పడేలా చేస్తుంది, కానీ తర్వాత ఆమె జ్ఞాపకశక్తి కోల్పోయే అరుదైన వ్యాధితో బాధపడుతోందని తెలుసుకుంటాడు. కొన్ని రోజుల్లో తన జ్ఞాపకశక్తిని కోల్పోతానని తెలుసుకున్న నందిని, ఆమె తన దినచర్యలను డైరీలొ రాయడం ప్రారంభిస్తుంది. ఆమె తన డైరీలోని 18వ పేజీలో ఉండగా ఆమె కిడ్నాప్ అవ్వడం, తర్వాత జ్ఞాపకశక్తిని కోల్పోవడం కథలో ఒక మలుపు తిరుగుతుంది. అయితే సిద్దార్థ్ నందిని ని ఎలా కనుక్కున్నాడు, ఈ క్రమం లో ఆమె డైరీ ఎలా ఉపయోగపడింది అనేది మిగతా కథ.

18 pages telugu-movie-story-review-rating

రివ్యూ:

సుకుమార్ రైటింగ్స్‌కు ప్రత్యేక అభిమానుల సంఖ్య ఉంది. విభిన్న ప్రేమ కథలను రాస్తాడని అతడికి పేరు. అలాగే కుమారి 21F తో అలరించాడు. ఆ తర్వాత ఇప్పుడు 18 పేజెస్ తో లవ్ స్టోరీ తో పాటు, థ్రిల్లర్ ని కలిపి రాసాడు. ఈ కథ బాగుంది. దీన్ని తెరకెక్కించడం లో సూర్య ప్రతాప్ కొంత వరకు విజయం సాధించాడు. హీరో నిఖిల్ కొంత వరకు మెప్పించాడు. కానీ కార్తికేయ తర్వాత అతడి నుంచి ఆశించిన పెరఫార్మెన్సు ఇది కాదు. అనుపమ తన నటన తో సినిమాని నిలబెట్టింది. మిగిలిన నటులు మెప్పించారు.

సినిమాటోగ్రఫీ ఫస్ట్ హాఫ్ వరకు బావుంది. సెకండ్ హాఫ్ కి తగిన విజువల్స్ లేవు. అలాగే గోపి సుందర్ మ్యూజిక్ బావుంది కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తగినంత స్థాయి లో లేదు.

18 pages telugu-movie-story-review-rating
ప్లస్ పాయింట్స్ :

 • కథ
 • స్క్రీన్ ప్లే
 • ట్విస్ట్ లు
 • అనుపమ యాక్టింగ్

మైనస్ పాయింట్స్:

 • మిస్సయిన ఎమోషన్

రేటింగ్ : 3 /5

18 pages telugu-movie-story-review-rating
ట్యాగ్ లైన్ :

ఫైనల్ గా 18 పేజెస్ సస్పెన్సు తో ఉన్న ప్రేమ కథ. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది.

watch trailer :