టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ ఫలితంతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తుంటాడు. ఇటీవలే ఈయన నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజై మిక్స్డ్‌ టాక్‌ తెచ్చుకుంది. మొన్నటి వరకు లవ్‌స్టోరీ సినిమాలు తీసే నితిన్‌.. ఈ సారి తన జానర్‌కు భిన్నంగా పూర్తి స్థాయి సీరియస్‌ కథతో వచ్చి ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు.

Video Advertisement

 

ఈ సినిమాతో ప్రముఖ ఎడిటర్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యాడు. మాచర్ల నియోజకవర్గం వరల్డ్ వైడ్‌గా ఆగస్టు 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆల్ మోస్ట్ 950 వరకు థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్‌ను సొంతం చేసుకుంది. ట్రైలర్ అండ్ టీజర్స్‌తో మంచి పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా విడుదలైన తర్వాత మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

nithin's macharla niyojakavargam ott release date..

ఈ సినిమా ఓటీటీ హక్కులను ‘జీ-5’ సంస్థ దక్కించుకుంది. కాగా ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 9 నుండి స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు ప్రకటన వచ్చింది. అవుట్‌ అండ్ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా క‌లెక్టర్‌గా కనిపించాడు. కృతిశెట్టి, క్యాథెరీన్ థ్రెసా హీరోయిన్లుగా న‌టించారు.

nithin's macharla niyojakavargam ott release date..

ప్రస్తుతం నితిన్‌ ఒక కమర్షియల్‌ సక్సెస్‌ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. భీష్మ తర్వాత నితిన్‌కు ఇప్పటివరకు మరో హిట్‌ లేదు. ఇక నితిన్‌ తన నెక్ట్స్‌ చిత్రాన్ని వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయబోతున్నట్లు సమాచారం. మరి ఈ చిత్రంతో అయినా మంచి కంబ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూడాల్సి ఉంది.