ఇంటిని ఖాళీ చేయాలంటూ బలవంతం చేస్తున్నారా..? ఈ రూల్స్ ని తప్పక తెలుసుకోండి..!

ఇంటిని ఖాళీ చేయాలంటూ బలవంతం చేస్తున్నారా..? ఈ రూల్స్ ని తప్పక తెలుసుకోండి..!

by Megha Varna

Ads

చాలా మంది ఓనర్లు ఇంటిని అద్దెకు ఇచ్చేవారి పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇల్లు అద్దెకు ఇవ్వడానికి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఉన్నపళంగా ఇల్లు ఖాళీ చేయమని ఏ ఓనర్ చెప్పకూడదు. ఎందుకంటే ఆర్ధికంగా పూర్తిగా స్థిరపడని వారే ఎక్కువగా రెంట్ హౌస్ లో నివాసం ఉంటూ ఉంటారు.

Video Advertisement

rent house 1

ఉన్నపళంగా ఇల్లు ఖాళీ చేయాలి అంటూ ఓనర్ బలవంత పెట్టకూడదు. ఇల్లు ఖాళీ చేయించాలి అనుకుంటే కొంత గడువు ముందుగానే వారికి సమాచారం ఇవ్వాలి. వారు మరో ఇంటిని వెతుక్కునే వరకు అవకాశం ఇవ్వాలి. కొంతమంది అద్దెకు ఉండేవారు కూడా కర్కశంగా వ్యవహరిస్తూ ఓనర్లని ఇబ్బంది పెడుతూ ఉంటారు. దీనివల్ల ఇల్లు అద్దెకి ఇచ్చేవారికి కూడా ఇబ్బందులు వస్తాయి. అయితే ఇల్లు అద్దెకి ఇచ్చేటప్పుడు ఇంటి యజమాని ఎలాంటి రూల్స్ ని అనుసరించాలి అనేది చూద్దాం.

Claim tax deduction on both House Rent Allowance (HRA) and home loan interest under Section 24, 80C and 80EEA

ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఇల్లు కాళీ చేయించమని ఓనర్లే అద్దెకు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి వెళ్లిపొమ్మని చెప్తున్నారు. అందుకని ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండాలంటే రెంటల్ లీడ్ రాసుకోవాలి. ఒకవేళ కనుక ఏ సమస్య ఎదుర్కోకుండా ముందు నుంచి జాగ్రత్త పడాలి అంటే ఇంట్లో ఉండే వాటిని రాయాలి. అంటే ఫర్నిచర్ మొదలు బల్బులు వరకు రాసుకోవాలి. అయితే ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా అప్పగించాలని అందులో రాసి ఉంచుకోవాలి. రెంటల్ లీడ్ అనేది 11 నెలలకు రాసుకోవాలి. ఆ తర్వాత మళ్లీ దానిని రెన్యువల్ చేసుకోవచ్చు.

How to Buy the Right Furniture for Your House | Durian Blog

రెంటల్ లీడ్ అనేది ఒక లీగల్ ఫార్మేట్. సెక్యూరిటీపరంగా కూడా అందులో రాసుకోవచ్చు. అయితే ఇల్లు అద్దెకి ఇచ్చేటప్పుడు తెలిసిన వాళ్లకి ఇస్తే మంచిది. అలానే రెంటల్ లీడ్ లో మీరు అద్దెకి ఇచ్చిన వాళ్ళు ఇతరులకి అద్దెకు ఇవ్వకూడదని కూడా రాసుకుంటారు. ఎందుకంటే కొందరు ఇల్లు అద్దెకు తీసుకుని అందులో ఉండే గదులని మరికొందరికి అద్దెకి ఇస్తూ ఉంటారు.

List of legal documents you need before renting a house

మరొక ముఖ్యమైన విషయమేమిటంటే యజమానులు ఇంటికి వచ్చి చెక్ చేసుకుంటే కొందరి వద్దంటారు. అందుకనే ఓనరు ఎప్పుడైనా ఇల్లుని నేను చెక్ చేసుకుంటాను అని కూడా రాస్తున్నారు. అలానే ఒకవేళ అద్దెకి ఉండేవాళ్ళు ఖాళీ చేయమని దౌర్జన్యంగా మాట్లాడితే.. కోర్టుకి ప్రొసీడ్ అయ్యే ముందు వాళ్ళకి నోటీసు ఇవ్వాలి. లీగల్ నోటిస్ కి రెస్పాండ్ అయితే పర్వాలేదు. ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళని ఇంటి నుండి ఖాళీ చేయించమని కోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది.


End of Article

You may also like