హిందూ ధర్మం ప్రకారం ఎవరైనా చనిపోతే “REST IN PEACE” అనకూడదు అంట…ఎందుకో తెలుసా?

హిందూ ధర్మం ప్రకారం ఎవరైనా చనిపోతే “REST IN PEACE” అనకూడదు అంట…ఎందుకో తెలుసా?

by Mohana Priya

Ads

సామాన్యంగా ఎవరైనా చనిపోతే మనం రెస్ట్ ఇన్ పీస్ అనే పదాన్ని వాడతాం. దాని అర్థం చనిపోయిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలి అని అనుకుంటాం. కానీ హిందువుల్లో రెస్ట్ ఇన్ పీస్ అనే పదం వాడటం సరికాదు. ఆ పదం వెనుక ఒక అర్థం ఉంది.

Video Advertisement

క్రైస్తవులు చనిపోయిన వాళ్ళని పాతి పెడతారు. వాళ్లకి తీర్పు వచ్చే రోజు ఒకటి ఉంటుంది. అంటే ఆరోజు ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా అనేది ప్రభువు నిర్ణయిస్తారు. తీర్పు వచ్చే రోజు వరకు ఆత్మ ఆ సమాధిలో ఉంటుంది. తీర్పు రోజున చనిపోయిన వాళ్ళు మళ్ళీ లేస్తారు అని నమ్ముతారు. అప్పటివరకు ఆ ఆత్మ శవపేటిక లోపల ఉండాలి. అందుకే తీర్పు వచ్చేంతవరకు శాంతం తో ఉండమని రెస్ట్ ఇన్ పీస్ అన్న పదాన్ని వాడుతారు.

హిందూ మతం లో చనిపోయిన వాళ్ళు తిరిగి లేవడం అనేది ఉండదు. హిందూ మతం పునర్జన్మను నమ్ముతుంది. మరణించిన వ్యక్తి ఈ జీవితం లో చేసిన కర్మల ఆధారంగా వచ్చే జన్మ ఉంటుంది అని చెబుతుంది. కాబట్టి ఆత్మకి విశ్రాంతి అనేది లేదు.

హిందూ మతం లో ఆత్మకి మోక్షం ఉంటుంది అని నమ్ముతుంది. ఇక్కడ మోక్షం అంటే విముక్తి. జననం నుండి మరణం వరకు ఉన్న జీవిత చక్రంలో లో మనిషికి తోడు గా ఉన్న ఆత్మకి విముక్తి. అందుకే రెస్ట్ ఇన్ పీస్ అన్న పదాన్ని ఉపయోగించకుండా ఆత్మ మోక్షాన్ని పొందాలి అని, లేదా ఓం శాంతి అని, లేదా ఓం సద్గతి అని చెప్పాలి. సద్గతి అంటే మోక్షం లేదా విముక్తి అని అర్థం.

ఇంకా రెస్ట్ ఇన్ పీస్ అర్థం ప్రేతాత్మ అర్థం వచ్చేలా ఉంటుంది. హిందూ ధర్మం ప్రకారం చనిపోయిన వ్యక్తి శరీరాన్ని విడిచి పెట్టగానే ప్రేతాత్మ గా మారతారు. అందుకే రెస్ట్ ఇన్ పీస్ అన్నప్పుడు ఆ ఆత్మ భూమిపైనే ఉండిపోవాలని ప్రార్థిస్తున్నాం. అప్పుడు ఆత్మ ప్రేతాత్మ గా మారుతుంది. హిందువుల్లో మనిషి చనిపోయిన 13వ రోజు ఒక కార్యక్రమం చేస్తారు.

పదమూడవ రోజు కార్యక్రమంలో ప్రేతాత్మ ను ఈ భూమి విడిచి వెళ్ళమని కోరుతారు. అంటే మరో జన్మ తీసుకోమని అయినా కావచ్చు లేదా ఆత్మకు మోక్షం కలగాలి అని అయినా కావచ్చు. ఓం సద్గతి అని చెప్పడం ద్వారా ఆత్మని వెళ్లాలని కోరుతున్నట్టు అర్థం వస్తుంది.

ఇంకా హిందువులు పునర్జన్మను నమ్ముతారు కాబట్టి అలా చెప్పడం ద్వారా ప్రశాంతంగా అయినా కూడా ఈ భూమి మీద ఉండొద్దు అని, మరో జన్మ తీసుకోవాలి అంటే ఇప్పుడు ఆత్మ ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాలి అని కోరుతున్నట్టు కూడా అర్థం వస్తుంది.అందుకే హిందూ ధర్మం ప్రకారం రెస్ట్ ఇన్ పీస్ అన్న పదానికి అర్థం వేరేగా ఉంటుంది కాబట్టి ఆ పదం వాడటం సరి కాదు అనడానికి ఇదే అంతరార్థం.


End of Article

You may also like