టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో మరో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ‘ఎన్టీఆర్‌ 30’ (వర్కింగ్ టైటిల్) పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. గతంలో వీరిద్దరి కాంబోలో ‘జనతా గ్యారేజ్‌’ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చిత్రం వచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్‌ 30పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌, స్క్రిప్ట్‌ వర్క్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ను జరపుకోనుంది.

Video Advertisement

అయితే ఈ చిత్రం లో హీరోయిన్ ఎవరనే దానిపై చాలా రోజులుగా.. చాలా పేర్లు వినిపిస్తున్నాయి. చివరికి.. మొదట అనుకున్నట్లుగా జాన్వీ కపూర్ నే ఈ చిత్రం లో హీరోయిన్ గా ఫైనల్ చేసారు. ఈ మేరకు ఆమె పుట్టిన రోజు అయిన మార్చి 6 న అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే గతం లో ఒక ఇంటర్వ్యూ లో తనకు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ఉందని జాన్వీ తెలిపింది. అప్పుడు ఆ హోస్ట్ గట్టిగా కోరుకోండి జరిగిపోతుంది అని చెప్పగా జాన్వీ అలాగే చేసింది. ఇక చివరికి జాన్వీ కోరిక నెరవేరనుందని ఆమె ఫాన్స్ సంతోష పడుతున్నారు.

NTR 30 heroine officially confirmed..

జాన్వీ కపూర్ ని ఎన్టీఆర్ ప్రాజెక్ట్ లోకి ఆహ్వానిస్తున్నట్లు మేకర్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. మరో వైపు ఎన్టీఆర్ 30 సినిమాపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చి చాలా కాలం అయింది కానీ సెట్స్ మీదకు మాత్రం తీసుకురాలేదు. ఫిబ్రవరి నెలలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని అంతా భావించగా.. నందమూరి తారకరత్న మరణంతో మళ్ళీ బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో మరోసారి ఎన్టీఆర్ 30 లాంచింగ్ డేట్ ఇదే అంటూ టాలీవుడ్ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది. మార్చి 18 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని డిసైడ్ అయ్యారట మేకర్స్. ఇందుకు ఎన్టీఆర్ కూడా ఒప్పుకోవడంతో షూటింగ్ కి సంబంధించిన పనులు షురూ చేసినట్లు తెలుస్తోంది.

NTR 30 heroine officially confirmed..

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ సంయుక్త భాగ‌స్వామ్యంలో ఎన్టీఆర్‌ 30 సినిమా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎన్టీఆర్ 30కి ర‌త్న‌వేల్‌ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాడు. మ‌రోవైపు ‘కేజీఎఫ్’ డైరెక్ట‌ర్‌ ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మరో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.