యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు తెరపై తనదైన ముద్ర వేసి స్టార్ హీరోగా ఎదిగాడు. నటన, డాన్స్, డైలాగ్ లలో తనకు తానే పోటీగా నిలిచాడు. అందులోనూ ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో దుమ్ములేపాడు తారక్. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా సత్తా చాటుతుంది. మొన్నటి వరకు ఇండియాకే పరిమితమైన ఈ మూవీ క్రేజ్ ఇప్పుడు ప్రపంచం మొత్తం వ్యాపించింది.

Video Advertisement

 

 

ఇప్పటికే ‘నాటు నాటు’ సాంగ్ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుని దక్కించుకుంది. మరోవైపు లాస్‌ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్‌ అసోసియేష్‌ పురస్కారం దక్కింది. అంతేకాదు బెస్ట్ ఫారెన్‌ లాంగ్వేజ్‌ మూవీ విభాగంలో ఉత్తమ చిత్రంగా క్రిటిక్‌ ఛాయిస్‌ అవార్డుని `ఆర్‌ఆర్‌ఆర్‌` సొంతం చేసుకుంది. ఇక ఆస్కార్ కి అడుగు దూరం లో ఉంది ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది.

ntr comments on his english accent trolls..!!

అయితే ఇటీవల లాస్‌ ఏంజెల్స్ లో జరిగిన గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్దుల వేడుకలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణితోపాటు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, దర్శకుడు రాజమౌళి సతీ సమేతంగా పాల్గొన్నారు. అయితే ఈ పురస్కారం వచ్చిన సందర్భంగా వెరైటీ’ మీడియా ప్రతినిధితో తారక్ మాట్లాడి అబ్బుర పరిచాడు. యంగ్‌ టైగర్‌ ఈ రేంజ్‌లో అమెరికన్‌ యాసలో ఇంగ్లీష్‌లో మాట్లాడటం తో అందరు షాక్ అయ్యారు. అయితే ఎన్టీఆర్‌ యాసని ఫేక్‌ యాక్సెంట్‌ అంటూ ట్రోల్స్ చేశారు కొందరు నెటిజన్లు. లేటెస్ట్ గా దీనిపై ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యాడు.

ntr comments on his english accent trolls..!!

డైరెక్ట్ గా దీనిపై ఎన్టీఆర్ కామెంట్ చెయ్యలేదు కానీ పరోక్షంగా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. `మేం కేవలం టైమ్‌ జోన్‌లో, కొంచెం యాసలో వేరుగా ఉన్నాం అంతే కానీ, ఒక నటుడు ఎక్కడైనా నటుడే’. అని ఎన్టీఆర్ మరో ఇంటర్వ్యూ లో వెల్లడించారు. ఇక ఆర్ఆర్ఆర్ గురించి, రాజమౌళి గురించి మాట్లాడుతూ.. రాజమౌళి తన సినిమాలతో ప్రపంచం మొత్తాన్ని అలరించే సత్తా ఉన్న గొప్ప దర్శకుడని అన్నారు. దక్షిణాదిలోని తెలుగు చిత్రసీమ నుంచి వచ్చిన ఆర్ ఆర్ ఆర్‌తో ఈ స్థాయికి, ఇక్కడి రావడం ఈ అవార్డ్‌లు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.