ఆర్ఆర్ఆర్ సినిమా తో ఎన్టీఆర్ క్రేజ్ మరెంత పెరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఇప్పుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబో లో ఇంకో సినిమా చేస్తున్నారు. అయితే సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ చెయ్యలేదు. ‘ఎన్టీఆర్‌ 30’ పేరు తో ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబో లో వచ్చిన జనతా గ్యారేజ్‌ బ్లాక్ బస్టర్ అయ్యింది.

Video Advertisement

 

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ సంయుక్త భాగ‌స్వామ్యంలో ఎన్టీఆర్‌ 30 సినిమా ని తెర మీద కి తీసుకు వస్తున్నారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ ఈ సినిమా కి మ్యూజిక్ ఇస్తున్నారు. అలానే ఎన్టీఆర్ 30కి ర‌త్న‌వేల్‌ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేస్తున్నారు. హీరోయిన్ కి సంబంధించి ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా లో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఫైనల్ చేసారు. మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ లో థియేటర్లలో రిలీజ్ కానుంది.

NTR conditions to koratala siva..!!

ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుండటం తో కొరటాల శివకు జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో షరతులు విధించారని తెలుస్తోంది. డైలాగ్స్ తో సహా బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేయాలని సూచించారని సమాచారం. కొరటాల శివ సైతం ఈ సినిమా విషయంలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా కథ, కథనాలను అద్భుతంగా సిద్ధం చేశారని ఇన్సైడ్ టాక్. కొరటాల శివ మైథలాజికల్ టచ్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఈ సినిమా షూటింగ్ జరగనుందని సమాచారం అందుతోంది.

NTR conditions to koratala siva..!!

ఆచార్య ప్లాప్ నేపథ్యం లో ఈ సినిమా స్క్రిప్ట్ పకడ్బందీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట కొరటాల శివ. అంతే కాకుండా కాస్టింగ్ సెలక్షన్ విషయంలో ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుందట. కన్నడ నుండి నటి రుషికా రాజ్ తో పటు ఒక యంగ్ హీరోని, అలాగే మలయాళం నుండీ అపర్ణ బాలమురళిని తీసుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వచ్చిన ఒక మాస్ మోషన్ పోస్టర్ గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఎన్టీఆర్ అభిమానుల్లో ఈ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ ని ఇచ్చింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.