ఎన్టీఆర్-జక్కన్నల స్నేహం ఈనాటిది కాదు. రాజమౌళి ఎన్టీఆర్ కి కెరీర్ స్టార్టింగ్ లోనే “సింహాద్రి” మూవీ తో హిట్ ఇచ్చారు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య మంచి అనుభవం ఉంది. కెరీర్ స్టార్టింగ్ లో ఎన్టీఆర్ కొంచం లావుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ టైం లో ఓసారి జక్కన్న రాజమౌళిని చూసి.. మీరు బాగా లావు గా, అసహ్యం గా ఉన్నారు.. అంటూ చెప్పారట.

ntr

ఆ విషయాన్నీ ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. అప్పుడు నాకు ఒకటే అనిపించింది.. మన సన్నిహితులే మనకు సరైన మార్గ నిర్దేశకం చేస్తారు అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. వెంటనే “మీది జుట్టు ప్రాబ్లెమ్.. నాది కొవ్వు ప్రాబ్లెమ్.. అంతే తేడా” అని అన్నాను అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాదు ఇండస్ట్రీ రాణించాలి అనుకునే వారికి సలహాలను కూడా చెప్పారు. మనకి అన్ని తెలుసు అనుకుంటాం.. కానీ మనకి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయని.. నిత్యం తెలుసుకుంటూ ఉండాలని చెప్పారు. అలాగే ఇండస్ట్రీ లో రాణించాలంటే నిజాయితీ ఉండాలని సూచించారు.