ఈ ఒక్క కోరిక తీరకుండానే “సీనియర్ ఎన్టీఆర్” మరణించారా..? అది ఏంటంటే..?

ఈ ఒక్క కోరిక తీరకుండానే “సీనియర్ ఎన్టీఆర్” మరణించారా..? అది ఏంటంటే..?

by kavitha

Ads

నట సార్వభౌమ నందమూరి తారక రామరావుగారు తెలుగు సినీ ఇండస్ట్రీ కోసం ఎంతో కృషిని చేశారు. ఆయన కెరీర్ లో ఎన్నో పాత్రలలో నటించి మెప్పించారు. ఇక శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంటే తెలుగువారికి ఎన్టీఆర్ రూపమే కనిపిస్తుంది.

Video Advertisement

ఎన్టీఆర్ వేర్వేరు జానర్ల చిత్రాలలో నటించి సంచలన విజయాలు నమోదు చేశారు.  ఆయన ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసేవారు. నటించిన పాత్రకు వంద శాతం న్యాయం చేసే యాక్టర్లలో ఎన్టీ రామారావు ముందు వరుసలో ఉంటారు. అయితే ఆయన నటించాలని అనుకున్న పాత్రను మాత్రం చేయలేకపోయారు. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తన నట ప్రస్థానంలో ఎన్నో చిత్రాలలో అనేక పాత్రలను పోషించిన ఎన్టీఆర్ ఒక పాత్రను ఎంతగానో ఇష్టపడ్డారు. ఆ పాత్రలో నటించాలని ఎన్నో ఏళ్లు అనుకున్నారు. కానీ ఎన్ని సార్లు ప్రయత్నించిన కానీ ఆ పాత్రను చేయడం మాత్రం వీలుకాలేదు. అనుకున్న ప్రతిసారీ ఏదో ఒక ఆటంకం ఏర్పడేది. అలా ఆయన కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిచారు. ఎన్టీఆర్ చేయాలనుకుని, చేయలేకపోయిన ఆ పాత్ర విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు.
అల్లూరి సీతారామరాజు కథతో ఒక చిత్రాన్నినిర్మించాలని ఎన్టీఆర్ అనుకున్నారు. తోడు దొంగలు అనే చిత్రం తర్వాత ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు చిత్రంలో నటించాల్సి ఉంది. కానీ అప్పటికే జయసింహ అనే చిత్రాన్ని ప్రకటించడంతో ఎన్టీఆర్ జయసింహ సినిమా తరువాత చేయాలని అనుకున్నారు. ఇక జయసింహ మూవీ పూర్తి అయ్యి రీలజ అవడం విజయం సాధించడం జరిగింది. అప్పుడు ఎన్టీఆర్ సీతారామరాజు పాత్రలో నటించే చిత్రం ప్రారంభం అయినా వేరే కారణాలతో ఆ చిత్రం ఆగిపోయింది.
అయితే పాండు రంగ మహత్మ్యం మూవీ తర్వాత ఈ చిత్రంలో నటించాలని ఎన్టీఆర్ అనుకున్నారు. అయితే ఆ టైం లో అల్లూరి సీతారామరాజు స్క్రిప్ట్ లో కథానాయకకు చోటు లేకపోవడంతో పడాల రామారావు కథను మార్చాలని ఎన్టీఆర్ ను అడిగారు. ఇక ఆ తర్వాత శోభన్ బాబుతో అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని తీయాలని ఒక సంస్థ అనుకున్న ఆర్థిక సమస్యల వల్ల ఆ మూవీ వెనక్కు తగ్గింది.అయితే అదే స్టోరీని సూపర్ స్టార్ కృష్ణ తీసుకోవడం, ఆ కథకు త్రిపురనేని మహారథి కొన్ని మెరుగులు దిద్దడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో అల్లూరి సీతారామరాజు 100వ చిత్రంగా తెరకెక్కింది. ఈ చిత్రం కృష్ణ కెరీర్ లోనే మైలు రాయిగా నిలిచింది. అద్భుతమైన విజయాన్ని సాధించింది.
ఎన్టీఆర్ కృష్ణ నటించిన ఈ చిత్రాన్ని చూసిన తరువాత అల్లూరి సీతారామరాజు సినిమా చేయాలని అనుకోలేదు. ఇక అల్లూరి సీతారామరాజు చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ అద్భుతమైన నటనను ఎన్టీఆర్ ప్రశంసించారు. అయితే అల్లూరి సీతారామరాజు సినిమాలో నటించనప్పటికీ, ఎన్టీఆర్ అల్లూరి పాత్రలో కొన్ని చిత్రాలలో కనిపించారు.

Also Read: తన భర్త హఠాన్మరణం వెనుక ఉన్న కథని మొదటిసారి చెప్పిన “భాను ప్రియ” చెల్లి..! అసలు విషయం ఏంటంటే..?

 


End of Article

You may also like